ఫీజుల నియంత్రణ చట్టం పగడ్బందీగా అమలు చేయాలి:ఎస్ఎఫ్ఐ

ఫీజుల నియంత్రణ చట్టం పగడ్బందీగా
అమలు చేయాలి:ఎస్ఎఫ్ఐ

జిల్లా కార్యదర్శి కెలోత్ సాయి కుమార్
మహబూబాబాద్, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్):భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కేళోత్ సాయికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థుల తల్లితండ్రుల దగ్గర ఫీజుల పేరుతో రక్తం జలగ లాగా పట్టిపీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎక్కడ కూడా ఫీజులు నియంత్రణ చట్టం అమలు చేయకుండా విద్య హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని దానిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు దాదాపు 4వేల కోట్ల రూపాయలు పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయని అవి విడుదల చేయకుండా బంగారు తెలంగాణలో విద్యా అభివృద్ధి ఎలా చెందుతుంది అని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు పై చదువులకు విద్య అందని ద్రాక్షగా మారుతుందని తక్షణమే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం సమ్మర్ క్లాస్ పేరుతో గురుకులాల్లో విద్యార్థులకు సమ్మర్ క్లాస్ నిర్వహించడం కోసం విద్యార్థుల దగ్గర బలవంతపు సంతకాలు చేసుకొని సమ్మర్ క్లాసులు నిర్వహించడం దుర్మార్గమని అన్నారు తక్షణం ప్రభుత్వం ఆలోచనని విరమించుకోవాలని లేనియెడల విద్యార్థుల ఏకం చేసి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు సింహాద్రి, పట్టణ నాయకులు భూక్యా రాజేష్,లక్ష్మణ్,కే.భరత్ మురళి, సంతోష్, విష్ణు వర్ధన్, గణేష్,పండు,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *