ఫ్రీ బస్ ఎఫెక్ట్:దారుణంగా
కొట్టుకున్న మహిళలు

హైదరాబాద్, జనవరి 1 (విశ్వం న్యూస్) : జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ మారిన విషయం ఏదైనా ఉందంటే అది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే చెప్పాలి. మహిళలకు ఫ్రీ బస్ అనే హామీ ఇస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుందని రాజకీయ పార్టీలు కూడా బలంగా నమ్మే పరిస్థితి కనిపిస్తోంది.
ఎందుకంటే ఈ హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా.. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ హామీని చేర్చి.. ఇక్కడ కూడా సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఫ్రీ బస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. మరీ ముఖ్యంగా బస్సుల్లో సీట్ల కోసం మహిళలు యుద్ధాలు కూడా చేసుకుంటున్నారు.