పట్టణ భవితవ్యం ఓటర్ల చేతుల్లోనే

పట్టణ భవితవ్యం
ఓటర్ల చేతుల్లోనే

హైదరాబాద్, ఫిబ్రవరి 1, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య పిలుపునిచ్చారు. పట్టణాల అభివృద్ధి ప్రజలు ఎన్నుకునే కౌన్సిలర్, కార్పొరేటర్‌ల నాయకత్వంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.

డబ్బు, మద్యం, ప్రలోభాలు, కుల–మత సెంటిమెంట్లకు లోనుకాకుండా నిజాయితీ, సామాజిక సేవా భావం, అభివృద్ధి దృక్పథం కలిగిన అభ్యర్థులకే ఓటు వేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వార్డు, డివిజన్ సమస్యలపై అవగాహన కలిగిన నాయకులే పట్టణ ప్రజల ఉజ్వల భవిష్యత్తును నిర్ధారిస్తారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *