గ్రామ పంచాయితీ సిబ్బంది
న్యాయమైన డిమాండ్లు
వెంటనే పరిష్కరించాలి

- సరియైన వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడి చేస్తున్న ప్రభుత్వం
- పిసిసి మెంబర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో, జూలై 29 (విశ్వం న్యూస్) : గ్రామాలలో ఏ చిన్న పని జరుగాలన్నా పంచాయితీ సిబ్బంది గుర్తుకు వస్తారు అటువంటి పంచాయితీ సిబ్బంది ఈ రోజు శ్రమ దోపిడీకి గురవుతున్నారని పిసిసి మెంబర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
మండల పరిషత్ కార్యాలయం వద్ద గత ఇరవై నాలుగు రోజులుగా చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జూలై ఆరు నుండి గత ఇరవై నాలుగు రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరం అన్నారు. పిఆర్సి లో నిర్ణయించిన విధంగా మినిమం బేసిక్ వేతనాలు కూడా చెల్లించకుండా గ్రామ పంచాయితీలలో అన్ని పనులు చేపించుకోడం ముమ్మాటికీ శ్రమ దోపిడీయే అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ వీరి పక్షాన నిలిచి వీరి న్యాయమైన డిమాండ్ లు పరిష్కారం అయ్యేంత వరకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూర అంజిరెడ్డి, కాశిపాక శంకర్, పడెళ్ళి సంపత్, మహేష్, లక్ష్మి, పోశమ్మ, రాజయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఎండి చాంద్, మంద మహేష్, మామిడి సత్యనారాయణ రెడ్డి,షేక్ శేహెన్ష, కమల్, తదితరులు పాల్గొన్నారు.