ఓ మహిళా కానిస్టేబుల్ చివరి ఆవేదన

ఓ మహిళా కానిస్టేబుల్ చివరి ఆవేదన

  • ఉమెన్ కానిస్టేబుల్ డీపిక సూసైడ్ లెటర్ లో కలచివేసిన అంశాలు

హైదరాబాద్‌, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) :: మహిళా కానిస్టేబుల్ డీపిక ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆమె రాసిన సూసైడ్ లెటర్‌లోని వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఆర్థిక భారంతో పాటు వ్యక్తిగత బాధలు ఆమెను మానసికంగా వెంటాడినట్లు స్పష్టమవుతోంది.

ఆమె లేఖలో పేర్కొన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:

“సారీ రిషి, పాప చంటి… చాలా ఆలోచించాను, కానీ నావల్ల కాదు. క్షమించండి.”

“మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు సహాయం చేయరు. ఆర్థికంగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోండి.”

“శ్రీనివాస్… నీ గురించి ఎంతో ఆలోచించాను. కానీ ఇక నా వల్ల కాదు.”

“మంచి రోజులు వస్తాయనుకుని చాలా రోజులుగా వేచి చూశాను. కానీ ఆశలు నెరవేరలేదు.”

“పిల్లల స్కూల్ ఫీజు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాను.”

“నా అవయవాలు ఉపయోగపడతే డొనేట్ చేయండి. నీవెలా బతుకుతావో శ్రీనివాస్… భయంగా ఉంది.”

“ఇంట్రెస్ట్ ఇచ్చేసినవాళ్లు మళ్లీ నన్ను తిట్టుకోకండి.”

“కో-ఆపరేటివ్ లోన్ క్యాన్సిల్ కాకుండా, శ్రీను & పవన్ శాలరీ నుండి డిడక్షన్ కాకుండా చూడండి.”

ఆమె కొన్ని రుణాల వివరాలను కూడా లేఖలో ప్రస్తావించింది:

అన్నా వదినకి ₹9,600

మాధవికి ₹1,500

బి.శ్రీనివాస్ కు ₹24,000

సాగర్ శ్రీకాంత్ కు ₹45,000 చెల్లించాల్సిన బాధ్యత తన కుటుంబాన్ని వెంటాడవద్దని పేర్కొంది.

డీపిక సూసైడ్ లెటర్ ఆమె ఎదుర్కొన్న బాధలు, ఆర్థిక ఒత్తిడులను ప్రతిబింబిస్తోంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. పోలీసు వ్యవస్థలో పని చేసే మహిళలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లపై మరోసారి చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *