జూబ్లీహిల్స్‌ టికెట్‌ నుంచి మొదలైన మాయా ఆట!

  • కోవర్ట్‌ కుట్రలో చిక్కుకున్న కాంగ్రెస్!
    సిబిఎన్ మాయలో తెలంగాణ కాంగ్రెస్!
    పార్టీ లోపలే రాజకీయ పావులు!
    జూబ్లీహిల్స్‌ టికెట్‌ నుంచి మొదలైన మాయా ఆట!

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (విశ్వం న్యూస్‌): తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు కొత్త మలుపు తిరుస్తున్నాయి. పాత నాయకత్వం బలహీనపడుతున్న నేపథ్యంలో కొత్త వర్గం ఆకస్మాత్తుగా ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోవర్ట్‌ వ్యూహం ఉందన్న చర్చ బలంగా వినిపిస్తోంది.

జూబ్లీహిల్స్‌ టికెట్‌ నుంచి మొదలైన ఈ రాజకీయ పావులు, ఇప్పుడు మొత్తం తెలంగాణ కాంగ్రెస్‌ను చుట్టుముట్టుతున్నాయి. పార్టీ సీనియర్లు జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క వంటి నేతలు నిర్ణయాధికారాల నుంచి దూరమవుతున్నారని వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా ఎదుగుతున్న నాయకత్వం “కోవర్ట్‌ డైరెక్షన్”లో నడుస్తోందని, పాత నేతల ప్రతిష్టను కించపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

“జన్నన్న వంటి నేతలపై వ్యక్తిగత దాడులు చేయించి ప్రజల మనసుల్లో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం జరుగుతోంది” అని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం —సిబిఎన్‌ తన రాజకీయ వ్యూహంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్‌లో మాయా పావులు వేస్తూ, పార్టీని బలహీనపరిచి, తన కోవర్ట్‌ ద్వారా ఆధిపత్యం సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మొత్తంగా చూస్తే — తెలంగాణలో కాంగ్రెస్‌లో నడుస్తున్న ఈ అంతర్గత ఆటలు, పార్టీ భవిష్యత్తుపై మబ్బులు కమ్ముతున్నాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *