ఐదవ డివిజన్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్

ఐదవ డివిజన్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్

బోడుప్పల్, మార్చి 17 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ కంటి వెలుగు ఉచిత కంటి వెలుగు శిబిరంలో భాగంగా శుక్రవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఆధ్వర్యంలో ఐఐసిటీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరానికి ముఖ్య అతిథిగా బోడుప్పల్ మేయర్ సామల బుచ్చి రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ విచ్చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ వార్డ్ కమిటీ సభ్యులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *