ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి

ఓటరు జాబితాలో పేరు
నమోదు చేసుకోవాలి

  • హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా ఖబ్బరొస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ముస్లిం సోదరులకు విజ్ఞప్తి

హుజురాబాద్, (విశ్వం న్యూస్) : ప్రజాస్వామ్యంలో ప్రజలు వారికి నచ్చినవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని, 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు తమ పేర్లను ఓటరు జాబితాలో తప్పక నమోదు చేసుకోవాలని త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో తమ పేర్లను ఓటర్లు నమోద చేసుకోలేకుండా ఉన్నవారు ఈనెల సెప్టెంబర్ 16వ తేదీలోపు మీ యొక్క పేరును ఓటర్ లిస్టులో మీ యొక్క పేరును నమోదు చేసుకోవాలని హుజురాబాద్ డివిజన్ మస్జిద్గా ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

హుజురాబాద్ పట్టణంలో ముమ్మింపురా లో జరిగిన ముస్లింల సమావేశంలో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ చాలా మంది ముస్లిం సోదరులు సోదరీలు 18 సంవత్సరాలు నిండిన యువకులు చాలామంది వారి వారి ప్రాంతాలలో వారి యొక్క పేర్లు ఓటర్లలో లిస్టులలో పేరు నమోదు చేసుకోకుండా ఉన్నవారు ప్రతి ఒక్కరు ఈ నెల సెప్టెంబర్ 16వ తేదీ లోపు మీ యొక్క పేరును ఓటర్ లిస్ట్ కు నమోద చేసుకోవాలని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సోదరీ లకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

జమ్మికుంట పట్టణంలో ముస్లిం కమ్యూనిటీ హాల్లో జరిగిన ముస్లింల సమావేశంలో ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మజీద్ ఖురేషి కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జాకీర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మసీద్ అండ్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో చాలా ప్రాంతాలలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో చాలామంది పేర్లు ఓటర్ లిస్టులో వారి యొక్క పేర్లు నమోదు కాకుండా ఉన్నాయి గనుక వెంటనే జమ్మికుంట పట్టణంలో ముస్లిం సోదరులు సోదరులు 18 సంవత్సరాలు నిండిన యువకులు యువతి పేర్లను కూడా ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి వారి అందరికీ మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణాలలో కానీ జిల్లా కేంద్రం పట్టణంలో కానీ ఎక్కడ ఎక్కడ ఏ ఏ గ్రామాలలో ముస్లిం సోదరులు నివసిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు మహమ్మద్ సిరాజ్, మహ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ ఫయాజ్, మహమ్మద్ అబ్బో, మహమ్మద్ అప్సర్, మహ్మద్ గౌస్, మహమ్మద సర్వర్, మహమ్మద్ మౌలానా, మహమ్మద్ ఖలీల్యా, మహమ్మద్ రసూల్, మహమ్మద్ సలీం, మహమ్మద్ భాష, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *