కళ్లముందే కూలుతున్న గూడు… గుండెలు పిండేస్తున్న దృశ్యం (వీడియో)

విశ్వం న్యూస్ / ఖమ్మం, ఫిబ్రవరి 26: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హృదయ విదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. “చివరిసారిగా ఒక్కసారి నా ఇల్లు చూసుకోనివ్వండి..!!” అంటూ బాధితులు భోరున విలపించారు. రూపాయి రూపాయి పోగేసి, ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న ఇళ్లను కళ్లముందే కూలగొడుతుంటే తట్టుకోలేక కన్నీళ్ల పర్యంతమయ్యారు.
గుడిసెలు, చిన్న ఇళ్లు కూలిపోతున్న సమయంలో మహిళలు, వృద్ధులు, పిల్లలు వణికిపోయారు. తమ జీవితాల ఆశ్రయమైన గూడు ఒక్కసారిగా నేలమట్టం అవుతుండటంతో బాధితుల ఆవేదన ఆకాశాన్ని తాకింది. సరైన పునరావాసం, న్యాయం కోరుతూ వారు అధికారులను వేడుకున్నారు.
ఈ ఘటన ఖమ్మం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం, ప్రత్యామ్నాయ నివాసం కల్పించాల్సిందిగా ప్రజాసంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.