పార్టీకోసం పనిచేసిన ఉద్యమకారులకే వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి

మంత్రి గంగులను కలిసిన గుండ్ల భాగ్యలక్ష్మి కుమార స్వామి
కరీంనగర్, పిబ్రవరి 25 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ ను కరీంనగర్ లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ పాత్రికేయులు గుండ్ల భాగ్యలక్ష్మి కుమారస్వామి. ఈ సందర్భంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మాకు కేటాయించాలని మంత్రి గంగుల కమలాకర్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ అతి త్వరలోనే అందరితో మాట్లాడి పార్టీకోసం పనిచేసిన ఉద్యమకారులు, సీనియర్లకే జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కుతుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి ఎస్టీ జర్నలిస్టుల అధ్యక్షులు కట్కూరి మల్లేష్, ప్రధాన కార్యదర్శి ఆరేల్లి మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బందేల రాజశేఖర్, ఉపాధ్యక్షులు గుండ్ల కుమారస్వామి, నగేష్ తదితరులు హాజరయ్యారు.