రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇవ్వలి

కాంగ్రెస్ నాయకుడు ఎండి సాహెబ్ హుస్సేన్
వీణవంక, మార్చి 17 (విశ్వం న్యూస్) : నిన్న కురిసిన వడగండ్ల వర్షం కారణంగా వీణవంక మండలంలోని అనేక గ్రామాలలో రైతుల మొక్కజొన్న మరియు వరి పంటలు దెబ్బతిన్నాయని మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కెసిఆర్ రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ హాయంలో పంట నష్టం జరిగిన సందర్భాల్లో రైతులకు పరిహారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నదని ఎండి సాహెబ్ హుస్సేన్ గుర్తు చేశారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలని, అధికారుల ద్వార పంట నష్టం అంచనాలు వేసి చేతులు దులుపుకోకుండా, రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో రైతులను కలుపుకొని కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండి సాహెబ్ హుస్సేన్ హెచ్చరించారు.