మహిళా బిల్లు పోరాటం.. దేశమంతా వ్యాపించాలి: ఎమ్మెల్సీ కవిత

మహిళా బిల్లు పోరాటం.. దేశమంతా వ్యాపించాలి: ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ, మార్చి 10 (విశ్వం న్యూస్) : ఢిల్లీ జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత సంస్కృతిలో మహిళకు పెద్దపీట వేశారన్నారు. అమ్మానాన్న అంటారు.. అందులో అమ్మ శబ్ధమే ముందు ఉంటుంది. రాజకీయాల్లోనూ మహిళకు సముచిత స్థానం దక్కాలని స్పష్టంచేశారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందేవరకు సంపూర్ణ మద్దతు: సీపీఎం నేత సీతారాం ఏచూరి
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మహిళా రిజర్వేషన్‌ కోసం చేసే పోరాటంలో పాల్గొంటామని ప్రకటించారు. మహిళలకు భాగస్వామ్యం లేనంత వరకు సమాజం ముందుకు పోదని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేస్తున్నారు. దీక్షకు హాజరైన సీపీఎం నేత సీతారాం ఏచూరి.. కవితకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కవిత ఒక మంచి అడుగు వేశారని చెప్పారు.

ప్రధాని మోదీ.. నారీశక్తి గురించి గొప్పగా మాట్లాడుతారు.. కానీ మహిళా బిల్లును మాత్రం లోక్‌సభలో ప్రవేశపెట్టరు అని అకాలీదళ్‌ నేత నరేష్‌ గుజ్రల్‌ విమర్శించారు. బీజేపీ తన మేనిఫెస్టోలో బిల్లు తెస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ఆగస్టు 15న ఎర్రకోట నుంచి నారీ శక్తి గురించి గొప్పగా మాట్లాడుతారని, కానీ మహిళా రిజర్వేషన్‌ బిల్లును మాత్రం లోక్‌సభలో ప్రవేశపెట్టరని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత పోరాటానికి అకాలీదళ్‌ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అన్నారు. అయినా మోదీ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *