ఇది ముమ్మాటికీ మానవ
హక్కుల ఉల్లంఘనే!!:
దాసోజు శ్రవణ్ ఫైర్

- బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఆయన ట్విట్టర్ (X) వేదికగా ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్, డిసెంబర్ 12 (విశ్వం న్యూస్) : లగచర్ల గిరిజన బాధితులపై ఇంత కోపమెందుకు ముఖ్యమంత్రి గారు; మీ వైఖరి పాశవికతకు పరాకాష్ట!! దౌర్జన్యంగా భూములు లాక్కునే ప్రయత్నం చేసింది చాలక, తప్పుడు కేసులు పెట్టి, ఆఖరికి జైళ్లలో వారికీ గుండె సంబంధిత ఇబ్బంది ఉంటె రాజ్యాంగ వ్యతిరేకంగా సంకెళ్లు వేసి హింసించడం న్యాయమా?? వారికీ జైళ్లలో కనీస వైద్యం ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకా ఎన్నిరోజులు వారికీ బెయిల్ రాకుండా అడ్డుకుంటారు? మా భూములు మాకే అన్న పాపానికి వారిని చంపుతరా??
హీర్యా నాయక్ కుటుంబ సభ్యులను చూడనివ్వరా? పరామర్శ కూడా చేయనివ్వరా? న్యాయం కోరిన వికారాబాద్ సీనియర్ న్యాయవాది శ్రీ రాంచందర్ గారిపై దురుసుగా ప్రవర్తించడం కూడా హక్కుల ఉల్లంఘనే!! గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న హీర్యా నాయక్ కు నిమ్స్ ఆస్పత్రి లోచికిత్స చేయాలి!!
ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే!! ప్రభుత్వం ఆధిపత్య అహంకారంతో చేస్తున్న నేరం!!!
ఇదేమి ప్రజా పాలన?
ఇదేమి పోలీస్ రాజ్యం ??