
- కొన్నిసార్లు దశాబ్దాలు గడచిపోతాయి కానీ ఏమీ అవ్వవు.కొన్నిసార్లు వారాల వ్యవధిలోనే దశాబ్దాల మార్పులు సంభవిస్తాయని అంటాడు ఒక మహనీయుడు. !!!!!
హైదరాబాద్, మార్చి 16 (విశ్వం న్యూస్) : ఇప్పుడు బిజేపికి పోయేకాలం సంభవించింది కాబట్టే ఒక ఆడబిడ్డను (కవితక్క)అవమానిస్తుంది.కేసులపేర వేదిస్తుంది.బండి సంజయ్ లాంటి మూర్ఖుడిచేత అనరాని మాటలు అనిపిస్తుంది.నిండుసభలో స్త్రీని అవమానించినందకు దుర్యోధనుడు రాజ్యము, ప్రాణము రెండూ పోగొట్టుకున్నాడు. మేము బలవంతులం మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని మోడీ విర్రవీగుతున్నాడు. మోడీ ఒక ఇడీఆమిన్ లాగా రక్తపిశాచిలా కోరలుచాచి జనంమీదకొస్తున్నాడు. బిజేపిలో చేరుతారా? జైలుకెళుతారా?అనే కుటిల రాజనీతిని అమలు చేస్తున్నాడు. తను అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించినవారిపై దేశద్రోహ, రాజద్రోహ ముద్రవేసి జైలులో వేస్తున్నాడు. అవినీతి ముద్రవేసి ప్రతిపక్షనేతలను బలహీనపరుస్తున్నాడు.

ఒకేదేశం,ఒకేజాతి, ఒకేసంస్క్రతి, ఒకేపార్టీ అనే ఫాసిస్టు సిద్దాంతాన్ని అమలు చేయడానికి పక్కా వ్యూహంతో ముందుకొస్తున్న మోడీ పతనం తెలంగాణ నుంచే మొదలవుతుంది. ఆంధ్ర వలసపాలకులు కూడా మేము బలవంతులమని విర్రవీగారు. తెలంగాణ నాయకులకు వెన్నుముక లేదని హేళనచేశారు. అరవైతొమ్మిది ఉద్యమాన్ని అవలీలగా అణచివేశామని అహంకారంతో విర్రవీగారు. మీడియాబలంతో, ధనబలంతో, రాజ్యబలంతో తెలంగాణను ఆరు దశాబ్దాలు అణచివేశారు. దోచుకు తిన్నారు. చివరకేమైంది??????
తెలంగాణ నడిబొడ్డు నుండే ఒక నాయకుడు (బాపు కేసిఆర్) ఉద్భవించాడు. ఒక్క నిరాహారదీక్షతో తెలంగాణ జనాన్ని తట్టిలేపాడు,దశాబ్దాల నియంతృత్వ పాలనను నాలుగేళ్ళలోనే అంతమొందించాడు.ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్ని సాదించుకున్నాం. కేసులు ఎదుర్కొన్నాం. సాదించుకున్న రాష్ట్రాన్ని ఉద్యమస్పూర్తితో కాపాడుకున్నాం. నేడు దేశానికి పట్టిన మోడీ చీడను వదిలించడానికి మాబాపు కెసిఆర్ కదిలాడు. మోడి ద్రోహాన్ని జనంముందు విప్పుతున్నాడు. దేశం నలుమూలలనుండి మాబాపుకు మద్దతు పెరుగుతుంది. బెంబేలెత్తిన మోడీ అక్రమకేసులతో లొంగదీసుకోవాలనుకుంటున్నాడు.
ఉద్యమనాయకురాలైన మా కవితక్కపై అవినీతి ఆరోపణలు చేస్తూ వేధిస్తున్నాడు. బ్యాంకులను,ప్రజాదనాన్ని లూఠీ చేసినవారిని అక్కున చేర్చుకుంటున్నాడు. ప్రజలపక్షం వహిస్తున్నందుకు మా తెలంగాణ బతుకమ్మను అవమానిస్తున్నాడు. తెలంగాణను జాగృతం చేసిన మా బతుకమ్మ నేడు భారతజాగృతి అంటూ దేశాన్ని జాగృతం చేయడానికి కదిలింది. మా బతుకమ్మ శాపంతగిలి మోడీ మట్టి కరువక తప్పదు.
ఒకేదెశం, ఒకేజాతి, ఒకేసంస్క్రతి ఒకేపార్టీ అంటూ మోడీ ఫాసిజాన్ని అమలుచేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడు.తనకు గిట్టనివారిపై రాజ్యాంగవ్యవస్థలను ఉసిగొల్పుతున్నాడు. నాకెదురులేదని విర్రవీగిన హిట్లర్ ను అంతమొందించడానికి స్టాలిన్ పుట్టినట్టుగా నేడు నియంత మోడీని రాజకీయంగా అంతమొందించడానికి మాబాపు కేసిఆర్ ముందుకొచ్చాడు. మేము తెలంగాణ ఉద్యమస్పూర్తితో, ఆశతో బాపు కేసిఆర్ వెంట నడుస్తాం. బలమైన శత్రువుతో తలపడతాం.దర్మం మావైపు ఉంది. ప్రజలు మావెంట ఉన్నారు.ప్రజలశక్తి ముందు ఫాసిజం ఓడిపోతుంది. ఇడిఅమిన్ లాగా రక్తదాహంతో ముందుకొస్తున్న మోడీ కోరలు తీయడం ఖాయం.