11 మంది ఐఏఎస్ ల బదిలీలు

హైదరాబాద్, డిసెంబర్ 17 (విశ్వం న్యూస్) : ఐఏఎస్ ల బదిలీలు : ముఖ్యమంత్రి రేవంత్ పాలన పరమైన నిర్ణయాలను వేగవంతం చేసారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రెటరీ గా అరవింద్ కుమార్.
ఎడ్యుకేషన్ సెక్రెటరీగా బుర్ర వెంకటేశం.
ఫారెస్ట్ సెక్రెటరిగా వాని ప్రసాద్.
MAUD కమిషనర్ గా దాన కిషోర్.
R & B కమిషనర్ గా శ్రీనివాస రాజు.
జీఏడీ సెక్రెటరీ గా రాహుల్ బొజ్జా.
HM& FW కమిషనర్ గా క్రిస్టినా.
హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ వర్క్స్ ఎండి గా సుదర్శన్ రెడ్డి.
కమర్షియల్ టాక్స్ సెక్రెటరి గా శ్రీదేవి.