తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు టీటీడీ గుడ్ న్యూస్

  • ‘వారానికి 4 సిఫార్సు లేఖలు’ –
  • ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు
  • తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో చర్చ
  • వారానికి 4 సిఫార్సు లేఖలకు ఏపీ సీఎం చంద్రబాబు అంగీకారం
  • తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సిఫార్సు లేఖలకు అంగీకారం
  • వారానికి రెండు బ్రేక్‌ దర్శనం సిఫార్సు లేఖలకు అంగీకారం
  • వారానికి రెండు రూ.300 దర్శనం లేఖలకు అంగీకారం

హైదరాబాద్, డిసెంబర్ 30 (విశ్వం న్యూస్) : తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు తిరుమల, తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల దర్శనానికి వచ్చే తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు రావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తెలంగాణ సిఫార్సు లేఖలకు చిక్కులు తొలగినట్లే.

ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఈ భేటీలో వీరు ప్రజా ప్రతినిధులకు శుభవార్త చెప్పారు. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలకు వారానికి 4 సిఫార్సు లేఖలను అంగీకరించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఇందులో వారానికి రెండు బ్రేక్ దర్శనాలతో పాటు మరో రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో టీటీడీ అధికారికంగా దీనిపై ఉత్తర్వులు జారీ చేయబోతోంది. అనంతరం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల్ని స్వీకరించడం ప్రారంభమవుతుంది. అలాగే ఏపీ-తెలంగాణ వివక్ష ఆరోపణలకు చెక్ పెట్టినట్లవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *