ఇద్దరు ఘరానా దొంగలు అరెస్టు

ఇద్దరు ఘరానా దొంగలు అరెస్టు

  • సుమారు 5 లక్షల సొత్తు స్వాధీనం. !!

కరీంనగర్ బ్యూరో, జూలై 10 (విశ్వం న్యూస్) : జల్సా లకు బానిసై దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకుని తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా చేసుకొని ఇళ్ళను కొల్లగొట్టి గుల్ల చేస్తున్న ఇరువురు దొంగలను , ఈరోజు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు వీరి వద్ద నుంచి దొంగిలించిన సుమారు (5) లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

కొత్తపెళ్లి మండలం రేకుర్తి విజయపురి కాలనీకి చెందిన కుంచం అశోక్ తండ్రి. నరసయ్య గతంలో కరీంనగర్ చుట్టుపక్కల పలు దొంగతనాలు చేసి పలుమార్లు పోలీసులచే అరెస్టు కావడం జరిగింది ఇతను దొంగతనాలకు అలవాటు పడి, తాళం వేసి ఉన్న ఇళ్లని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేయడం వృత్తిగా చేసుకున్నాడు.

ఇతడిని అనుసరించి ఇతని తమ్ముడు కుంచం రవి కూడా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు ఇద్దరు కలిసి కరీంనగర్లో పలు తాళం వేసి ఉన్న ఇళ్లకు కన్నం వేసి బంగారు, వెండి ఆభరణాలు మరియు నగదును దొంగిలించడం ప్రారంభించారు.

ఇటీవల కరీంనగర్ -1 టౌన్ పరిధిలో జరిగిన పలు దొంగతనం సంఘటనలలో కేసు నమోదు చేసుకున్న కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు దొంగల గట్టు రట్టు చేయాలనే సంకల్పంతో పట్టుదలతో దొంగల ఆచూకీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అతి తక్కువ కాలంలోనే కేసులను చేదించడం జరిగింది. పరిశోధనలో భాగంగా కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో కేసులను ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఈ ప్రత్యేక బృందాలు సిబ్బంది పలు సీసీ కెమెరాలు పరిశీలించి ఆ సీసీ కెమెరాలలో ఇద్దరు దొంగల కదిలికలను గమనించడం జరిగింది. వారిని రేకుర్థి కి చెందిన కుంచం అశోక్ మరియు అతడి తమ్ముడు రవి గా గుర్తించి వారి పై నిఘా వేయడం జరిగింది. పోలీస్ ల నిఘాను గమనించిన నిందితులు ఇక్కడ వుంటే పోలీస్ లకు దొరికి పోతామని, కరీంనగర్ నుండి యాదాద్రి కి వెళ్లి తల దాచు కునే ప్రయత్నం చేయగా వారి కదలికలను నిశితంగా గమనిస్తున్న పోలీస్ లు యాదద్రి కి చేరుకోగా అక్కడ నుండి కూడా జారుకున్న నిందితులు హైదరాబాద్, వరంగల్ , రామగుండం మొదలైన ప్రాంతాలను తిరుగుతూ ఈ రోజు కరీంనగర్ చేరుకోగా కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు వారిని చాక చక్యంగా పట్టుకుని వారి వద్ద నుండి సుమారు 5,40,000/- విలువైన సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది.

నిందితులు చేసిన నేరాల వివరాలు:
తేదీ. 28-06-23 రోజున అల్కాపురి కాలనీలో నివాసం ఉండే మహమ్మద్ గౌస్ అనునతడు బక్రీద్ పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి భార్యా పిల్లలతో తమ బంధువుల ఇంటికి వెళ్ళినాడు. తిరిగి 01-07-23 రోజున ఉదయం ఇంటికి రాగా ఇంటిలో తాళం పగలగొట్టి మరియు బీరువాను కూడా తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు మరియు నగదును దొంగిలించినారు

తేదీ. 29-06-23 రోజున కరీంనగర్ సిక్కువాడిలో నివసించే సర్దార్ స్వరణ్ సింగ్ తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి హైదరాబాదులో నివసించే తన కూతురి వద్దకు వెళ్ళినాడు తిరిగి తేదీ రోజున ఉదయం ఇంటికి రాగా ఏంటి ముందు డోర్ వేసిన చాలా పగలగొట్టి ఇంట్లో ఉన్న బీరువాను కూడా ధ్వంసం చేసి ఇంట్లోనే బంగారు ఆభరణములు మరియు నగదును దొంగిలించారు.

కరీంనగర్ కోతి రాంపూర్ లో నివాసం ఉండే గాజులు రాకేష్ అన్న తోడు మెడికల్ పనిచేస్తున్నాడు అతను తేదీ 19-04-23 రోజున రాత్రి ఇంటిలో ఉక్కగా ఉండడంతో ఇంటికి గడియ పెట్టి ఇంటి ముందు తన కుటుంబంతో పడుకోగా అర్థ రాత్రి దొంగలు ఇంటిలోకి ప్రవేశించి ఇంటి లో ఉన్న బంగారు ఆభరణాలు మరియు (2) మొబైల్ ఫోన్ లను దొంగిలించినారు.

నిందితుల వివరాలు…

  1. కుంచం అశోక్, తండ్రి. నర్సయ్య, 35 సం.లు. వడ్డెర, విజయపురి కాలనీ రెకుర్తి కరీంనగర్
  2. కుంచం రవి, తండ్రి. నర్సయ్య, 24 సం.లు. వడ్డెర, విజయపురి కాలనీ రెకుర్తి కరీంనగర్

స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు:

  1. బంగారు గాజుల జత (29) గ్రాములు
  2. 15 గ్రాముల బంగారు నెక్లెస్
  3. 8 గ్రాముల బాంగారు ముద్ద
  4. ఒక బంగారు ముక్కు పుడక
  5. రూ. 40,000/- నగదు
  6. ఒక I phone 14.pro విలువ సుమారు. 1,30,000/-
  7. ఒక vivo phone విలువ సుమారు. 30,000/-
  1. మొహమ్మద్ బషీర్, కానిస్టేబుల్
  2. HC భూమయ్య
  3. HC హస్సేన్
  4. ASI chaand paasha
  5. మరియు I టౌన్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ లను అభినందించడం జరిగింది.

ఈ కేసులను చాకచక్యంగా చేదించి దొంగలను పట్టుకోవడంలో నిరంతరం శ్రమించిన కరీంనగర్ వన్ టౌన్ ప్రత్యేక బృందాలు / క్రైమ్ సిబ్బంది:

శ్రీనివాసరావు తుల, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్ సిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *