ఆదిత్య క్లినిక్ ఆధ్వర్యంలో
ఉచిత వైద్య శిబిరం విజయవంతం

హైదరాబాద్, మార్చి 2 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ వార్డు గంధం గూడలో ఆదిత్య క్లినిక్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరం (Medical camp) విజయవంతం అయ్యింది. ఇందులో భాగంగా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందజేశారు.

అదేవిధంగా రోగులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఉచిత ఆరోగ్య శిబిరం స్థానిక ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను అందించడం హర్షణీయం. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలపల్లి కృష్ణారెడ్డి, కొరివి గణేష్, నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, భోగాల శ్రీనివాస్, కార్పొరేటర్లు మరియు తలారి రమేష్, సాగర్ గౌడ్, సురేష్, రాందాస్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సమాజహితం కలిగించే కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షిస్తున్నాము.