జమ్మికుంట వాసవి క్లబ్
ఆధ్వర్యంలో… డాన్ టు డస్క్
ఉదయాస్తమాన సేవలు

హుజురాబాద్ ఆర్సి, జూన్ 24 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి క్లబ్ జమ్మికుంట, వాసవి వనిత క్లబ్ జమ్మికుంట, వాసవి క్లబ్ ఇల్లంతకుంటవారి ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విఎన్ గోల్డెన్ కేసిజిఎఫ్ వల్లపు శెట్టి శ్రీనివాస్ గుప్తా, (విసిఐ ఇంటర్నేషనల్ డైరెక్టర్) విఎన్2కేసిజిఎఫ్ చకిలం రాజేశ్వరరావు (ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్),విఎన్ కేసిజిఎఫ్ తంగళ్ళపల్లి రాజభాస్కర్ (ఆర్సి డిస్టిక్ వి 107 ఏ రీజియన్5), గంప సురేందర్ (జడ్ సి), అయిత రమాదేవి (జడ్ సి), హాజరు కాగా జమ్మికుంట వాసవి క్లబ్ అధ్యక్షుడు రావికంటి నీలకంఠం, కార్యదర్శి అయితు రమేష్, వాసవి వనిత క్లబ్ జమ్మికుంట అధ్యక్షురాలు మద్ది లావణ్య, కార్యదర్శి గుండా సుఖిత, కోశాధికారి సుద్దాల సుజాత, వాసవి క్లబ్ ఇల్లంతకుంట అధ్యక్షుడు దొడ్డ వెంకటేశ్వర్లు, కార్యదర్శి సందుపట్ల సంపత్, కోశాధికారి చిదురాల వెంకటేశ్వర్లు,దాతల సహకారంతో కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో భాగంగా
1)దేశానికి వెన్నుముక అయినటువంటి రైతును సన్మానించి వ్యవసాయ ఉపయోగ ఎరువులను అందించడం
2) రక్షక మిత్ర లో భాగంగా దేశ సైనికుడికి సన్మానం తో పాటు స్థానిక సీఐ రమేష్ ని సన్మానించడం
3 కిట్ నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడ నిత్యవసర సరుకుల పంపిణీ
4)నిరుపేదలకి వస్త్ర పంపిణీ చీరలు దోతులు
5) వీధి వ్యాపారులకి గొడుగుల పంపిణీ
6)జన సమూహాలు ఉండే ప్రదేశంలో సేదతురుటకు బెంచిని వేయించటం
ఈ ఉదయాస్తమాన సేవలో వాసవి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు అందరికీ అధ్యక్ష కార్యదర్శకోశాధికారు లు కృతజ్ఞతలు తెలిపారు.
