ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

వీణవంక, ఆగస్టు 22 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామానికి చెందిన గాజుల శశి కుమార్ 19 సంవత్సరాలు ఇంటర్ విద్యార్థి సోమవారం రోజున ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే గాజుల శశి కుమార్ హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
చదువుకోవడం ఇష్టం లేక గత కొన్ని రోజులుగా ఇంటి వద్ద ఉంటున్నాడని ఈ విషయంపై తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడని మృతుని తల్లిదండ్రులు గాజుల తిరుపతి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండి ఆసిఫ్ తెలిపారు.