సొంత ప్రభుత్వంపై విజయశాంతి అసంతృప్తి

ఉద్యమకారుల హామీలపై విజయశాంతి ఫైర్

హైదరాబాద్, మార్చి 30 (విశ్వం న్యూస్): ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి శాసన మండలిలో ప్రశ్నించారు. సొంత ప్రభుత్వంపైనే ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం, నెలకు రూ.25 వేల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు ఒక్క హామీ కూడా అమలు కాలేదని విమర్శించారు.

ఉద్యమకారులు తమకు ఇచ్చిన హామీలు ఎక్కడాయని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అలాగే జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పినా, ఆ హామీ కూడా ఇంకా నెరవేరలేదని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *