వాలిబాల్ క్రీడోత్సవాలు ప్రారంభం
ప్రారంభించిన శ్రీ రామకృష్ణ ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్
కన్నాయిగూడెం, జనవరి 11 (విశ్వం న్యూస్) : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామం సంక్రాతి పండుగ సందర్బంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న 5 మండలాల వాలి బాల్ టోర్నమెంట్ ఆటల పోటీలను శ్రీ రామ కృష్ణ ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ రైతు బందు సమితి ములుగు జిల్లా అధ్య క్షుడు పళ్ళ బుచ్చయ్య కొబ్బరికాయ కొట్టి రిబ్బ న్ కట్ చేసి ఆటల పోటీలను ప్రారం భించారు.ఆటల పోటీల ప్రారంభోత్సవం కు వచ్చిన ట్రస్ట్ చైర్మన్ కు టోర్న మెంట్ మేనేజ్మె ట్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం క్రీడాకా రులను పరిచయం చేసుకొని వారు మాట్లా డుతు ఆటలు మానసిక ఉల్లాసన్ని మెదడుకు మేద శక్తిని ఇస్తాయని అన్నారు.ఈ కార్యక్ర మంలో తెరాస అధ్యక్షు డు సుబుల సమ్మయ్య, తెరాస సీనియర్ నాయకులు చిన్న కృష్ణ, సర్పంచ్ పూజారి లలిత శ్రీనివాస్, కన్నాయి గూడెం సర్పంచ్ ప్రభాకర్,ఏటూర్ సర్పంచ్ సిద్ధబోయిన సాగర్,మాజీ ఎంపీటీసీ గుఱ్ఱెవుల తడకల మధుకర్,ట్రస్ట్ సభ్యులు బాడిశ నవీన్,ఇందారపు రమేష్,మునిగల మహేష్,తోకల రాఖేష్,తోకల నవీన్ ,మండల సంతోష్,చిట్యాల రాజశేఖర్,గట్టిపల్లి అర్జున్,గంగేర్ల నాగరాజు,జానపట్ల విష్ణు,బోడ ప్రవీణ్, అరవింద్ బేతా వెంకటేశ్, గోగులముడి జోసఫ్, కనుకుంట్ల నాగరాజు, పాల్గొన్నారు.
