హైట్రిక్ సాధిస్తాం:మంత్రి మల్లారెడ్డి

- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జి
మర్రి రాజశేఖర్ రెడ్డి - మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఆఖరి ఆత్మీయ సమ్మేళనం సక్సెస్
పీర్జాదిగూడ, మే 16 (విశ్వం న్యూస్) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గూడెం మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి పలని కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ లో ఆఖరి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆత్మీయ సమ్మేళనం కనివిని ఎరుగని రీతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్మిక శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మఱ్ఱి రాజశేఖర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి హైట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్, బిజెపి పార్టీలు కల్లి బొల్లి మాటలతో మీ ముందుకు వస్తారని వారి మాటలు నమ్మొద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో 231 మున్సిపాలిటీ ఉన్నాయని, ప్రతిపక్షం లేని ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆని, భారత దేశంలోనే నెంబర్ వన్ కార్పొరేషన్ అని కొనియాడారు. రానున్న సార్వత్రికల ఎన్నికలలో బ్రహ్మాండమైన మెజార్టీతో స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పీర్జాదిగూడ ఓటర్లకు సూచించారు. పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోయినసారి కొంచెం లో నా మీద గెలిచిన ఎంపీ రేవంత్ రెడ్డి ఇంతవరకు ఇటు వంక కూడా తన ముఖం చూపెట్టలేదని, పీసీసీ జాతీయ అధ్యక్షుడు అంటూ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రసంగాలు ఇచ్చుకుంటూ పార్లమెంటు ప్రజలను మర్చిపోయారని ఎద్దేవా చేశారు కాబట్టి రాబోయే కాలంలో నన్ను గెలిపిస్తే మంత్రి మల్లారెడ్డి 24 గంటలు మీకు అందుబాటులో ఉన్నట్టు.. నేను కూడా మీకు అందుబాటులో ఉండి మీ రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.

గత ఐదు సంవత్సరాలుగా నాకు పిల్లనిచ్చిన మా మామ మంత్రి మల్లారెడ్డి నాకు బియ్యం కూడా పోయట్లేదని నవ్వుకుంటూ చెప్పారు. మేయర్ జక్క వెంకట్ రెడ్డి పార్టీ అధ్యక్షులు జిల్లా గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి లు మాట్లాడుతూ ఇంత ఘనంగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని దిగ్విజయం చేసిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు ఓటర్ దేవుళ్ళకు 26 మంది కార్పొరేటర్లకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా మణులు రాష్ట్ర జిల్లా నాయకులు కార్యకర్తలు యువత తదితరులు హాజరయ్యారు.