ఎన్టీఆర్ విగ్రహంను ధ్వంసం చేస్తాం

- యాదవుల సంఘం కరాటే కళ్యాణి
- కళ్యాణికి షోకాజ్ నోటీసులు పోంపిన మంచు విష్ణు
ఖమ్మం, మే 18 (విశ్వం న్యూస్) : తెలంగాణ లోని ఖమ్మం లో శ్రీకృష్ణుడు రూపంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీని మీద ఇప్పుడు వివాదం నెలకొంది. దేవుడి రూపంలో మానవ విగ్రహాలు ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని అఖిల భారత యాదవ సమితి హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని లేదంటే అడ్డుకుంటాం అని , నిరసనలు చేస్తామని ఒక ప్రకటన లో తెలిపింది.

సీనియర్ ఎన్టీఆర్ విగ్రహంను ధ్వంసం చేస్తాం అన్న కరాటి కళ్యాణి పై మండి పడ్డా మా అధ్యక్షుడు మంచు విష్ణు… షోకాజ్ నోటీసులు పోంపిన మంచు విష్ణు. కరాటే కళ్యాణికి షోకాజ్ నోటీసులు పంపించడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
