తీహార్ క్లబ్ కు స్వాగతం సుఖేష్ మరో సంచలన లేఖ

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ లేఖల పర్వం ఇంకా కొనసాగుతుంది. ఇటీవల కవిత, కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ సంచలన లేఖలతో పాటు చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తన న్యాయవాది ద్వారా విడుదల చేశారు. తాజాగా సుఖేష్ 5 పేజీలతో కూడిన మరో సంచలన లేఖను రిలీజ్ చేశారు. ఈ లేఖలో మరోసారి కవితపై, కేజ్రీవాల్ పై సుఖేష్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో కవిత ఫోన్ నెంబర్లను చూపుతూ స్క్రీన్ షాట్ ను రిలీజ్ చేశాడు. ఇక త్వరలోనే కేజ్రీవాల్ తో చేసిన చాటింగ్ ను కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.

తీహార్ క్లబ్ కు కవిత, కేజ్రీవాల్ కు స్వాగతమంటూ సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు. ముందు కేజ్రీవాల్ ఆ తరువాత నీ వంతే అంటూ కవితకు వార్నింగ్ ఇచ్చాడు. ట్విట్టర్ ద్వారా సమాధానం ఇవ్వవద్దని ఇవన్నీ కూడా పాత ట్రిక్కులని పేర్కొన్నాడు. తనను దొంగ, ఆర్ధిక నేరగాడిగా విమర్శిస్తున్నారని..కానీ అందులో మీరు భాగస్వాములే అని పేర్కొన్నాడు.

ధైర్యం ఉంటే సరైన రీతిలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలి. కవితను కవితక్క అని సంబోధించాను, ఆమె నా పెద్ద అక్కగా భావించాను. కానీ, దేశం, ప్రజాప్రయోజనాల రీత్యా సత్యం మాట్లాడుతున్నాను. కవితక్క నేను ఎవరో తెలియదని చెప్పారు.. కానీ కవితక్క అలా చెబుతారని అనుకోలేదు. కవిత అంటే నాకు గౌరవం.. అందుకే నేను ఆమె పేరును కవితక్క అని సేవ్ చేసుకున్నా. కవితక్కకు చెందిన రెండు ఫోన్ నెంబర్లు 91‌- 6209999999, 91-8985699999 నా ఫోన్‌లో కవితక్క అని సేవ్ చేసుకున్నా’ అని సుకేష్ లేఖలో రాసుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *