యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం

కరీంనగర్, జనవరి 10 (విశ్వం న్యూస్) : ఆత్మహత్య చేసుకున్న పోలీస్ ఉద్యోగ అభ్యర్థి పుప్పాల రఘు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బెల్లంపల్లి వెళ్తున్న యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి మార్గ మధ్యలో కరీంనగర్ లోని ఎన్.టి.ఆర్ విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు పడాల రాహుల్, కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గ నాయకులతో కొద్దిసేపు శివసేన రెడ్డి ముచటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రగులుతున్న సమయం అయిన పోలీస్ నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలపై న్యాయం జరిగే వరకు అంచేలంచెలుగా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన బెల్లంపల్లి నియోజకవర్గం పుప్పాల రఘు కుటుంబన్ని పరామర్శించి తీరుతానని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శులు గుర్రం వాసు, శ్యామసుందర్ రెడ్డి,కరీంనగర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు డింపు, ఖలీం, కృపసాగర్, నవాజ్, అనిల్ ముదిరాజ్, నాయకులు కిరణ్, అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.