మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – ఎమ్మెల్యే మందుల సామేలు

నాగారం, నవంబర్ 19 (విశ్వ న్యూస్): మత్స్యకారుల సంక్షేమాన్ని ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా తీసుకొని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పేర్కొన్నారు. బుధవారం నాగారం పెద్ద చెరువులో చేప పిల్లలను విడిచిపెట్టిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం శ్రద్ధగా పనిచేస్తోందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల ముదిరాజులు జీవనం సాగిస్తున్నారని, వారి ఆదాయ వనరులను పెంచేందుకు చేపల పెంపకాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో 64 పెద్ద చెరువులు, 209 చిన్న చెరువులు ఉన్నాయని, వీటిలో చేప పిల్లలను విడిచిపెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపల ఉత్పత్తి పెరగడంతోపాటు, స్థానిక మత్స్యకారులకు మంచి ఆదాయం కలుగుతోందని వివరించారు.
చేపల పెంపకందారులకు ప్రభుత్వం అందిస్తున్న 100 శాతం రాయితీని ముదిరాజు సమాజం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సామేలు సూచించారు. నాగారం పెద్ద చెరువులో ఈరోజు 1,60,000 చేప పిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. చేపల వనరులను పెంపొందించడం, మత్స్యకారుల ఆదాయాన్ని మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నాగుల్ నాయక్, ఇరిగేషన్ ఈఈ యాదగిరి, ఎమ్మార్వో హరికిషోర్ శర్మ, ఎంపీడీవో భీమ్ సింగ్, ఏవో కృష్ణకాంత్‌తో పాటు స్థానిక నాయకులు ఆకుల బుచ్చిబాబు, తోడుసు లింగయ్య, ఎల్సోజు నరేష్, కన్నెబోయిన వెంకట బిక్షం, కడియం పరమేశ్వర్, పానుగంటి నరసింహారెడ్డి, ఎర్ర యాదగిరి, ఎలమకంటి సోమన్న, బైరబోయిన మహారాజ్, ముకుందరెడ్డి, సైదులు, మంగదుడ్ల దశరథ, వలి, పరుశరాములు, లాక వీరయ్య తదితరులు పాల్గొన్నారు.