టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడి ఎన్నిక ఎప్పుడు?

  • తెలంగాణ స్టేట్ టీఎన్జీవోస్ అధ్యక్షునిగా మామిళ్ల రాజేందర్‌ రాజీనామా చేసినప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్ర టీఎన్జీవోస్ పోస్టు ఖాళీ ఎప్పుడు భర్తీ చేస్తారు
  • రాష్ట్రస్థాయి నూతన టీఎన్జీవోస్ సంఘ ఎన్నికలు జరిగినట్టు చేయాలి
  • తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం నాయకులకు విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 15 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో నాన్ గెజిటెడ్ గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన టీఎన్జీవో సంఘం అధ్యక్షుని పోస్టు ఖాళీ ఉండటంతో 33 జిల్లాలలో పనిచేస్తున్న ఉద్యోగులు తెలంగాణ స్టేట్ టీఎన్జీవో అధ్యక్షుని పోస్ట్ ఎప్పుడు భర్తీ అవుతుందని నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని తెలంగాణ స్టేట్ వాణిజ్య పనుల శాఖ నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఉద్యోగుల సమావేశం సందర్భంగా మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ టీఎన్జీవోస్ అధ్యక్షుని పోస్ట్ కొరకు కొంతమంది కోర్టుకు వెళ్లిన సందర్భముగా ఆ యొక్క పోస్టు ఖాళీగా ఉందని లేకుంటే ఇప్పటి వరకే పూర్తిస్థాయిలో తెలంగాణ స్టేట్ టీఎన్జీవోస్ అధ్యక్షుని నూతన కార్యవర్గం ఎప్పుడో ఏర్పాటు అయ్యేది కానీ కోర్టుకు వెళ్లడం వలన ఆ యొక్క సమస్య ఇప్పటివరకు అలాగని ఆ యొక్క సమస్య పెండింగ్లో ఉండటం వలన పూర్తి స్థాయిలో టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఎన్నిక కాకుండా పెండింగ్లో ఉంది కోర్టు సమస్య పరిష్కారమైనప్పుడే 33 జిల్లాల టీఎన్జీవో కార్యవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్ర టీఎన్జీవో నూతన అధ్యక్షునికి ఎన్నుకుంటారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నూతనముగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టికి తెలంగాణ స్టేట్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తీసుకొని వెళ్లడానికి తెలంగాణ స్టేట్ టీఎన్జీవోస్ అధ్యక్షుని పోస్ట్ ఖాళీ ఉండటం వలన చాలామంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ఎందుకంటే గత ప్రభుత్వము పిఆర్సి, ఐఆర్ డిఏ లు సరెండర్, లీవ్ మెడికల్ లీవ్ జిపిఎఫ్ ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారికి సంబంధించిన వారికి రావలసిన ఏరియాస్ అన్ని అలాగనే రాష్ట్రంలో పెండింగ్లో ఉండటం వలన చాలామంది ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గతంలో పనిచేసిన టీఎన్జీవోస్ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆ యొక్క పోస్టు ఇప్పటివరకు ఖాళీగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ స్టేట్ టీఎన్జీవోస్ జనరల్ సెక్రెటరీ జగదీష్ ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుని పదవిలో పనిచేస్తూ తెలంగాణ టీఎన్జీవోస్ భవనానికి ఇతర జిల్లాల నుంచి వచ్చి ఉద్యోగుల సమస్యలను రాష్ట్రస్థాయి మంత్రుల దృష్టికి రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ స్టేట్ టీసీ టీఎన్జీవోస్ సంఘ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.

ఇప్పటికైనా కోర్టులో కేసు వేసిన వారు ఇప్పుడు ఉన్న టీఎన్జీవోస్ నాయకులు కూర్చొని సమస్య తొందరగా పరిష్కరించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మేలు చేసిన వారు అవుతారని తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవోస్ అధ్యక్షులు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ వారిని కోరారు. ఎందుకంటే చాలా సమస్యలు చాలా సంవత్సరాల నుండి ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నాయి నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్ సీనియార్టీ విషయం కానీ కొత్త జోన్లకు నియామకమైన ఉద్యోగులకు సంబంధించిన సీనియార్టీలో ఇప్పటివరకు ప్రభుత్వ శాఖలలో పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉండటం వలన చాలామంది ఉద్యోగులకు ఇప్పటి వరకే అన్యాయం జరిగింది.

చాలా మంది 2024 సంవత్సరంలో పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులు కూడా కొన్ని నెలల వరకు అయినా మాకు మా శాఖలో ప్రమోషన్ వచ్చినచొ మాకు రెండు ఇంక్రిమెంట్లు వస్తాయని ఆశ చూస్తున్నారు. అలాంటి వారికి కూడా ఇప్పుడు వీరి గురించి, వీరి సమస్య గురించి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లే నాయకులు లేక చాలా మంది ఉద్యోగులు బాధపడుతున్నారు.

కనుక దయచేసి టీఎన్జీవోస్ నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ప్రయత్నం చేయాలని రెండు వర్గాలుగా విడిపోయిన వారిని అందరిని తెలంగాణ టీఎన్జీవోస్ భవనములో కూర్చోబెట్టి వెంటనే సమస్య పరిష్కారం అయినట్లు చేయాలనీ అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నాయకులకు తెలంగాణ స్టేట్ టి సి టి ఎన్జీవోస్ సంఘం అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *