

- జమ్మికుంట చెరువును దోస్తాం
- చెరువు మట్టిని దోస్తాం అడిగే వారేవరు … ?
- ప్రజా ప్రతినిదులు-అధికారులు కుమ్ముక్కే..
- ప్రజల భూమి సంపద బుడిక్కే
- రెవెన్యూ, మైనింగ్ శాఖలు మౌనం
- మున్సిపల్ కమిషనర్, పట్టణ సి.ఐ స్పందించాలని కోరుతున్న ప్రజలు.
జమ్మికుంట, జూన్ 11 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణ పరిధిలోని ప్రభుత్వ చెరువుల భూములలో, కుంటలలో మట్టిని తోడేస్తున్న వైనం. ఎక్కడ అవకాశం ఉంటే ఆకడ దోచేద్ధాం ఎదైనా అనే భావన కొంత మంది అధికార పార్టీకి చెందిన వారికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అధికార పార్టీ రాజకీయం మాధి మమ్మలని ఎవరు అడుగుతారు అంటూ చెరువు మట్టి దందాను ఎదెచ్చగా దోచుకుంటున్నా అడిగే నాథుడే లేడు. రాజకీయ అధికార బలంతో వీళ్ళు చేస్తున్న దోపిడీని పలు విమర్శలకు, చీ అనే వ్యవస్థకు దారితీస్తుంది.

జమ్మికుంట నాయిని చెరువు మట్టిని గతంలో కూడా అక్రమంగా తవ్వి తీసుకున్నా, ప్రస్తుతం కొన్ని రోజులుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా ఆ దిక్కుగా అధికార యంత్రాంగం దృష్టి సారించకపోవడం ఎంటో, అక్రమంగా చెరువు మట్టిని తోడేస్తున్నారని కొందరు స్థానికులు అధికార దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమంగా మట్టిని తీసుకెళ్తున్న జెసిబి యజమానులకు అధికార పార్టీ నాయకులకు కమిషన్ల వ్యవస్థ ఉండబట్టే మట్టి దందా కొనసాగుతుందని అర్థం అవుతుంది. అధికారుల అలసత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమంగా మట్టిని నాయిని చెరువు నుండి తీసుకెళ్తున్నప్పటికిని రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అంటే కమిషన్లు ముట్టొచ్చు అనే చర్చలు గుసగుస లాడుతున్నాయి.

చెరువులో నీరు తక్కువగా ఉండటంతో అధును చూసి మట్టి మాఫియా మట్టిని తోడేస్తు కోట్లాది రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. మట్టిని అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియాకు అధికార పార్టీ ప్రజా ప్రతినిదుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి అని ఇట్టే అర్థమవుతుంది. ప్రజలు ఏ రోజైనా ప్రతిఘటించక ముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.