ఉమెన్ కానిస్టేబుల్ డీపిక ఆత్మహత్య బాధాకరం: మంత్రి శ్రీదేవి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : ఉమెన్ కానిస్టేబుల్ డీపిక ఆత్మహత్య ఘటనపై తెలంగాణ మాజీ అధికార భాషా సంఘం చైర్మన్ మంత్రి శ్రీదేవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. డీపిక సూసైడ్ లెటర్ లో పేర్కొన్న ఆర్థిక సమస్యలు, భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోయిన స్థితి తనను తీవ్రంగా కలచివేశాయని మంత్రి శ్రీదేవి తెలిపారు.

“ఒక మహిళ పోలీస్ ఉద్యోగిగా సేవలందిస్తూ కుటుంబ బాధ్యతలతోపాటు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ, చివరికి మానసికంగా కుంగిపోయి ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం,” అని ఆమె అన్నారు. మహిళా ఉద్యోగులకు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీదేవి అన్నారు.
