మహిళా సంఘాలే గ్రామాభివృద్ధికి పునాది: ఎమ్మెల్యే మందుల సామేలు

మహిళా సంఘాలే గ్రామాభివృద్ధికి పునాది: ఎమ్మెల్యే మందుల సామేలు

నాగారం, ఫిబ్రవరి 10 (విశ్వం న్యూస్) : నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో మహిళా సంఘం నూతన భవనం నిర్మాణానికి మంగళవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ, మహిళా సంఘాల అభివృద్ధి ద్వారానే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

రూ.10 లక్షలతో నిర్మించనున్న ఈ నూతన భవనం మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. భవన నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భీమ్ సింగ్, కార్యదర్శి సురేష్, పీఆర్‌ఏఈ, గ్రామ సర్పంచ్ ఎర్ర సావిత్రి యాదగిరి, ఉప సర్పంచ్ వల్లాల భాను ప్రకాష్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు రామ్ రెడ్డి, నరసింహారెడ్డి, బత్తుల కరుణాకర్, లక్ష్మీకాంత్, శేఖర్ రెడ్డి, రావుల సత్తయ్య, మందుల వెంకన్న, విద్యాసాగర్, కల్లెట్లపల్లి మనోజ్, మహిళా సంఘం సభ్యులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *