కొత్త ఇంటి యజమాని దాధాగిరి మాటలు

జమ్మికుంట:కొత్త ఇంటి
యజమాని దాధాగిరి మాటలు

  • మున్సిపల్ ఆఫీస్ లో మరియు ప్రజా ప్రతినిధికి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చిన
  • మున్సిపల్ ఆఫీస్ లో ఎం జరుగుతోంది. మున్సిపల్
    ఆఫీస్ లో మరియు ఏ ప్రజా ప్రతినిధికి ఎంత ముట్టింది,
    నిజమా ..?

జమ్మికుంట, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : జమ్మికుంట బాలుర హై స్కూల్ ఎదురుగా ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఇంటి యజమాని నిబంధనలకు విరుద్ధంగా మరియు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఇంటి నిర్మానానికి తీసుకొచ్చిన ఇసుకను రోడ్డుపై అడ్డంగా పోశాడు. రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా రెండు బైక్ లు స్కిడ్ అయి పడిపోయాయి . ఇంటి నిర్మాణం నుండి రోడ్డు మీదుగా హై స్కూల్ గోడ వరకు కరెంట్ వైర్ నిర్లక్షంగా వేసి మిషన్ తో రాడ్లను కట్ చేస్తున్నారు . అలా రాడ్లని కట్ చేసేటప్పుడు రోడ్డుపై 10th క్లాస్ ఎగ్జామ్ విద్యార్థులు మరియు ప్రజలు , వాహనదారులు వెళ్లే వారు చాలా భయపడుతూ ఇబ్బందులకు గురయ్యారు.

అంతకు ముందు స్లాబ్ వేసేటప్పుడు ఇంటి నిర్మాణానికి ఇటు వైపు అటువైపు రెండు వైపులా రోడ్డును బ్లాక్ చేశాడు. రోడ్డును సగం బ్లాక్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. ఇసుకతో రోడ్డు ను బ్లాక్ చేయడం వలన రెండు బైక్ లు స్కిడ్ అయి పడిపోయారు, వాళ్ళకు గాయాలు కూడా ఐయ్యాయి. మీరు ఇసుకను రోడ్డుపై అంత నిర్లక్ష్యంగా ఉంచారు. హైస్కూల్ గోడ వద్ద స్థలం ఉంది. కదా అక్కడకు జరుపుకోండి అని చెప్పిన వాహనదారులు. సిటికేబుల్ మీడియా ప్రతినిధి కూడా ప్రశ్నించడం జరిగింది. కొత్త ఇంటి నిర్మాణం అటువైపు నుండి కరెంట్ వైర్ నిర్లక్ష్యంగా రోడ్డు మొత్తం ఆక్రమించి హై స్కూల్ గోడ వైపు వరకు ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు రాడ్లు కట్టింగ్ చేయడం వలన కరెంట్ సప్లై అనేది రోడ్డు పై ఉంటుంది.

ఏమాత్రం పొరబాటు జరిగినా కరెంట్ షాక్ తో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయి అని చెప్పినా కానీ, కొత్త ఇంటి నిర్మాణ యజమాని నిర్లక్ష్యంగా చెప్పిన సమాధానాలు-మున్సిపల్ ఆఫీస్ లో ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చిన. ఎవరూ బండి మీది నుండి పడ్డా కానీ నా ఇంటి నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు. ఎవరికి కరెంట్ షాక్ కొట్టి నా, నా ఇంటి నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు. కొత్త ఇంటి యజమాని దాధాగిరి మాటలు. మున్సిపల్ ఆఫీస్ లో ఎం జరుగుతోంది. మున్సిపల్ ఆఫీస్ లో ఎవరికి ఎంత ముట్టింది. నిజమా ..? ఇంటి నిర్మాణ యజమాని ఇంతగా అహంకారంగా మాట్లాడటం ఎంటి, దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటారా… ఇంటి నిర్మాణ యజమాని విషయంలో చర్యలు తీసుకోకుంటే RDMAకు, అక్కడ కాకుంటే CDMA వద్ధకు వెళ్ళటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *