మణికొండలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్య – ప్రేమ వ్యవహారమే కారణమా?

మణికొండలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్య – ప్రేమ వ్యవహారమే కారణమా?

హైదరాబాద్, ఫిబ్రవరి 25, 2026 (విశ్వం న్యూస్) : హైదరాబాద్‌ మణికొండ పరిధిలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రేమ వ్యవహారంలో నెలకొన్న మనస్తాపమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. ఏడాది క్రితం అఖిల్ రెడ్డి అనే వ్యక్తితో ఆమెకు బ్రేకప్‌ జరిగినట్లు, అప్పటి నుంచి కోమలి తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం.

సీసీటీవీ ఫుటేజ్‌ వివరాలు:
కోమలి ఆత్మహత్యకు ముందు అఖిల్ రెడ్డి ఆమె ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో బ్రేకప్‌ అయినప్పటికీ, అతన్ని విడిచి ఉండలేక కోమలి ఫోన్‌ చేసి ఇంటికి పిలిచినట్లు సమాచారం. తనతో కలిసి ఉండాలని కోమలి కోరగా, అఖిల్ నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం తీవ్ర మనోవేదనకు గురైన కోమలి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
*మనో ఒత్తిడి ఎదుర్కొంటున్న వారు కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *