గండిపేట్ సర్కిల్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

గండిపేట్ సర్కిల్‌లో
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో
వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్, డిసెంబర్ 21 (విశ్వం న్యూస్) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ సీపీ) గండిపేట్ సర్కిల్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ మాజీ అధ్యక్షులు, తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) సలహా కమిటీ మాజీ సభ్యులు బసిరెడ్డి సిద్ధారెడ్డి హాజరై అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ— “గండిపేట్ సర్కిల్ పేరుతో కొత్తగా ఏర్పాటైన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ జగన్ అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో పార్టీ కార్యక్రమాలు కూకట్పల్లిలో జరిగేవి. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరగడం ఆనందకరమైన విషయం. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా నిర్ణయాలు ఉంటాయి—ఎవ్వరూ అధైర్యపడవద్దు” అని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాచర్ల నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటరీ విభాగం జాయింట్ సెక్రటరీ పండ్ల మనోజ్ మాట్లాడుతూ— “గ్రామ స్థాయిలో విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యులుగా ఆలోచిస్తూ, 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే దిశగా కలిసికట్టుగా కృషి చేయాలి. అన్ని నియోజకవర్గాల్లో స్థానిక మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత వైఎస్సార్ సీపీ శాసనసభ్యులు గ్రామస్థాయిలో జరుగుతున్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను తరచూ సమీక్షించి కార్యకర్తలకు మనోధైర్యం కల్పించాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ అభిమానుల ఆకాంక్ష మేరకు రానున్న ఎన్నికల నాటికి పార్టీని విస్తరించాలి” అని సూచించారు.

ఈ వేడుకల్లో స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పంట మహేష్ బాబు, కె. శివకుమార్, ఎల్. నారాయణ రెడ్డి, ఓబుల్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కిషోర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకట్రావ్ యాదవ్, వల్లెపు శ్రీను, తన్నీరు సంతోష్, కార్తీక్, దార్ల ప్రసాద్, శ్యాంకుమార్ తదితరులు పాల్గొని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *