ఎంసెట్ లో అనుమాస్
గాయిత్రి రెడ్డికి 15వ ర్యాంక్

కరీంనగర్ బ్యూరో, మే 25 (విశ్వం న్యూస్) : తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాల్లో కరీంనగర్ పట్టణం జ్యోతినగర్ లో నివాసం ఉంటున్న నారాయణ జూనియర్ కళాశాల (హైదరాబాద్)లో అభ్యసించిన ఆణిముత్యం అనుమాస్ గాయిత్రి రెడ్డి తండ్రి శ్రీనివాస్ రెడ్డి బైపిసి విభాగంలో 160 మార్కులకు గాను 148 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 15వ ర్యాంక్ సాధించి కీర్తి పతాకం ఎగురవేసింది. ఈ సందర్భంగా కరీంనగర్ నారాయణ విద్యాసంస్థల ఏజియం ఎస్. తిరుపతి అభినందించారు.