ఎంసెట్-2023లో శ్రీ చైతన్య
‘ర్యాంకుల సునామీ ప్రభంజనం’

కరీంనగర్ బ్యూరో, మే 25 (విశ్వం న్యూస్) : ఈ రోజున ప్రకటించినబడిన ఎంసెట్ – 2023 ఫలితాలలో మా శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎంసెట్ ఫలితాలలో యు. మోహన్ సాయి 256, ఎ. కీర్తన 896, కె. డింపుల్ జస్టినా 1092, మధుకర్ 1109, యస్. శ్రీనివాస్ 1903, బి. సాయివినీత్ 2078, ఐ. రమణీ 2770, డి. వంశీకృష్ణ 2943, డి. కార్తీక్ 2958 మరియు 5000 లోపు 12 ర్యాంకులు ఇంకా 10000ల ర్యాంకులనందు 28 విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు.
ఎంసెట్-2023 లో రాష్ట్రస్థాయిలో అత్యున్నత ర్యాంకులు సాధించిన శ్రీ చైతన్య విద్యార్థినీ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులను చైర్మన్ శ్రీ ముద్దసాని రమేశ్ రెడ్డిగారు అభినందించారు. మరియు ఈ విజయ సాధనకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా తోడ్పడిన మా శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల అధ్యాపక బృందానికి కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి గారు, డీన్ జగన్ మోహన్ రెడ్డి గారు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ మల్లారెడ్డి గారు, తిరుపతిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, రాధాక్రిష్ణ గారు, ఎజియం శ్రీనివాస్ గారు మరియు అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.