24/7 నల్లా నీళ్ళిస్తామని ఇప్పటికి అతీగతీ లేదు

24/7 నల్లా నీళ్ళిస్తామని
ఇప్పటికి అతీగతీ లేదు

  • కనీసం రోజూ నీళ్ళు కూడా సరిగా ఇవ్వడం లేదు
  • మంత్రి కేటీఆర్ కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పి ప్రారంభోత్సవాలకు రావాలి
  • రేపు మధ్యాహ్నం వరకు స్పందించకపోతే అడ్డుకుంటాం
  • నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో, జూన్ 20 (విశ్వం న్యూస్) : ఇరవై నాలుగు గంటలు నల్లా నీళ్ళు ఇస్తామని చెప్పి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శిలాఫలకం శంఖుస్థాపన చేసి సంవత్సరం దాటినా ఇప్పటికి అతీగతీ లేదని,కనీసం రోజూ కూడా సరిగా నీళ్ళు ఇవ్వడం లేదని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో అలుగునూరు బ్రిడ్జి పైన పైలాన్,శిలాఫలకం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్ పది సంవత్సరాల నుండి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పుతనే ఉన్నాడని గత ఏడాది మార్చి నెలలో అట్టహాసంగా మంత్రి కేటీఆర్ చే శంఖుస్థాపన చేపించి పనులు ప్రారంభించకుండా కనీసం రోజూ కూడా సరిగా నీళ్ళు ఇవ్వడం లేదని అన్నారు. రేపు రోప్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి కేటీఆర్ కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.రేపు మధ్యాహ్నం వరకు స్పందించక పోతే ఏదో ఒక ప్రాంతంలో మంత్రి కేటీఆర్ ను అడ్డుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, చర్ల పద్మ, కుర్ర పోచయ్య, చంద్రయ్య గౌడ్, దన్న సింగ్, ముక్క భాస్కర్, ఎండి చాంద్, షబానా మహమ్మద్, దండి రవీందర్, సలీమొద్ధిన్, మెతుకు కాంతయ్య, మామిడి సత్యనారాయణ రెడ్డి, తమ్మడి ఎజ్రా, నాగుల సతీష్, కంకణాల అనిల్ కుమార్, ఊరడి లత, ముల్కల కవిత,నెల్లి నరేష్, మహమ్మద్ భారీ, సిరాజొద్దిన్, కాంపల్లి కీర్తి కుమార్, దామోదర్, శ్రీకర్, హనీఫ్, ఎగ్గడి శారద, అజయ్, దిలీప్, శారద, మహాలక్ష్మి, జిలకర రమేష్, యోనా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *