ఘనంగా స్వాతంత్య్ర
దినోత్సవ వేడుకలు
- ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ ఆఫీస్ నందు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన డాక్టర్.గూడూరి చెన్నారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 15 (విశ్వం న్యూస్) : ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా డాక్టర్.గూడూరి చెన్నారెడ్డి జాతీయ జెండా ఎగుర వేశారు. తర్వాత డాక్టర్.గూడూరి చెన్నారెడ్డి మాట్లాడుతూ… భారతదేశం ఆగస్టు 15, 2024న తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ వలస పాలన తర్వాత 1947లో ఇదే రోజున భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది.
ఈరోజు ప్రపంచంలోనే తిరుగులేని ఒక శక్తిగా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం భారతీయులందరూ గర్వపడాల్సిన సందర్భం, ఈ జాతీయ పండుగను ప్రతీ భారతీయ పౌరుడు సంతోషంగా, సగర్వంగా జరుపుకోవాలి. మనం స్వేచ్ఛగా జీవించటానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులందరినీ, వారు చూపిన దేశభక్తిని స్మరించుకోవాలి. భారత పౌరులందరికీ, సమస్త ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
రామమందిరం నిర్మించిన అయోద్యలో బీజేపీ ఓడిపోవడం హిందులలో ఐక్యత లేదనడానికి నిదర్శనం, హిందువుల ఐక్యతకోసం, భరత జాతి ఐక్యమత్యంకోసం నరేంద్ర మోడీ చేస్తున్న కృషి అభిందనీయం.
ఈ కార్యక్రమములో బ్రహ్మకుమారిస్ డా.బి కే. విజయలక్ష్మి, బికే. సునీత రాబోవు రాఖీపూర్ణిమ పురస్కరించి వచ్చిన వారికి రాఖీలు కట్టారు.
ఈ కార్యక్రమములో బి.కే.డా. గూడూరి విజయలక్ష్మి, తెలంగాణ స్టేట్ కోశాధికారి, డా. కే. హెచ్. ఎస్ .శర్మ జాతీయ జనరల్ సెక్రెటరీ, చింతపల్లి శోభా రెడ్డి ఉమెన్స్ వెల్ఫేర్ చైర్మన్, పెద్దూరు వెంకట దాస్, వి రాధాకృష్ణ, బి కే సునీత, టి. నాగరాజు, కె.కొల్లప్ప, శ్రీలత, DK గోపాల్ రావు, తరుణి రెడ్డి, బేబీ షరివి రెడ్డి, అధ్వర్ కొల్లూరు తదితరులు పాల్గొన్నారు.