ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయండి
ఖాళీగా ఉన్న లైబ్రేరియన్
పోస్టులు భర్తీ చేయండి

హైదరాబాద్, నవంబర్ 13 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఐఏఎస్ రిటైర్డ్ గారిని, తెలంగాణ లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్ మరియు నిరుద్యోగులు సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి విద్యా కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణలోని వివిధ విద్యా సంస్థలలో గల ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, గురుకుల పాఠశాలలు, వివిధ ప్రభుత్వ కళాశాలలు, ITI కళాశాలలు, సాంకేతిక కళాశాలలు, మెడికల్ కళాశాలలు మరియు వివిధ విశ్వ విద్య లయాలలో ఖాళీలుగా ఉన్న లైబ్రేరియన్ మరియు వాటి అనుబంధ పోస్టుల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సంధర్బంగా వారు ప్రతి ఉన్నత పాఠశాల లో లైబ్రరీలను ఏర్పాటు చేయాలని మరియు వాటిలో అర్హతలు గల లైబ్రేరియన్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ఉన్నత పాఠశాలలో లైబ్రరీలు ఉండడం ద్వారా స్కూల్ పిల్లలకు సరిగ్గా చదవడం, రాయడం అలవాటు అవుతుంది, ఆలోచించే అలవాటు, ఊహశక్తి, ఒత్తిడిని తట్టుకునే శక్తి, నేర్పరితనం, ఏకాగ్రత అలవడుతాయి మరియు చెడు వ్యాసనాల బారిన విద్యార్దులు పడకుండా (ముఖ్యంగా డ్రగ్స్ కు అలవాటు పడడం, గంజాయి, ఆన్లైన్ గేమ్స్ (రమ్మీ, పబ్జ్యి ), సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ) లాంటి చెడు వ్యాసనాల బారిన పడకుండా వుండాలంటే, వారు చిన్నప్పటి నుండే పుస్తకాలు, జర్నల్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ చదవడం లాంటి అలవాట్ల వైపు మరియు వివిధ భాషాల పై పట్టు (తెలుగు, హిందీ, మరియు ఆంగ్లము ) నేర్చుకునే విధంగా, వివిధ సబ్జెక్టు లపై, పరిజ్ఞానం, విశ్లేషించే సామర్థ్యం, చురుకుదనం అలవడును అని చెప్పడం జరిగింది.
అంతే కాకుండా గత DSC లో, మోడల్ స్కూల్ నోటిఫికెషన్స్ లలో కూడా లైబ్రేరియన్ పోస్ట్ లు వేయకపోవడం వలన లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్ ఎంతో నిరాశాకు లోనాయ్యమని చెప్పడం జరిగింది. కావున ఇప్పటి నుండి వెలువడే DSC నోటిఫికేషన్లలో తప్పకుండా లైబ్రేరియన్ మరియు వాటి అనుబంధ ఖాళీలలకు సంబంధించిన పోస్టులను మరియు మోడల్ స్కూల్స్ లలో కూడా లైబ్రేరియన్ పోస్టులను వేయాలని అభ్యర్థించారు.అంతే కాకుండా అన్ని కళాశాలాలు(ITI, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్, గురుకుల ), మరియు వివిధ యూనివర్సిటీ లలో లైబ్రేరియన్ మరియు వాటి అనుబంధ ఖాళీలను రాజస్థాన్, ఢిల్లీ,త్రిపుర,కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో భర్తీ చేసే విధంగా మన ప్రజా ప్రభుత్వంలో మన తెలంగాణ లో కూడా భర్తీ చేయాలని, మరియు మన రాష్ట్రం లోని ప్రైవేట్ స్కూల్స్ అయిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ లాగ లైబ్రరీలను ఏర్పాటు చేస్తారని వాటిలో అర్హతలు గల లైబ్రేరియన్స్ ను ఏర్పాటు చేస్తారని విజ్ఞప్తి చేయడం జరిగింది.
దీనికి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సార్ గారు సానుకూలంగా స్పందించారు. మేము అన్ని ఉన్నత పాఠశాలలో, అన్ని కళాశాలలో, వివిధ యూనివర్సిటీ లలో మరియు అన్ని విద్యా వ్యవస్థ లలో లైబ్రరీలు ఉండే విధంగా చూస్తామని ఈ అంశాలను విద్యా కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు క్యాబినెట్ దృష్టికి తీసుకు వెళ్తానని, మంచి నిర్ణయం తీసుకుంటామని హమీ ఇయ్యడం జరిగింది.
ఈ సంధర్భంగా తెలంగాణ లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్ మరియు అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సార్ గారికి ధన్యవాదములు తెలిపారు. వారిలో తెలంగాణ లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్ మరియు నిరుద్యోగ సంఘం సభ్యులలో ఆకుల సాయిలు, గిరి, మంజూల ,రాధాకృష్ణ ,బాబురాo,ప్రశాంత్ తదితర విద్యార్థులు ఈ సంధర్భంగా పాల్గొనడం జరిగింది.
