గిరిజన వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

గిరిజన వసతి గృహాలలో మౌలిక
సదుపాయాలు కల్పించాలి

గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎర్రయ్యకి ఎస్ఎఫ్ఐ
ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత
మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్) : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న కళాశాల వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా నాణ్యమైన భోజనం అందించాలని.., ఎస్టి కళాశాల వసతి గృహం బిల్డింగ్ ఏర్పాటు చేయాలని, వేసవికాలంలో విద్యార్థులకు చల్లని త్రాగునీరు అందించాలని పలు డిమాండ్లతో కూడిన వినతీ పత్రాన్ని అందజేశారు.

వినతి పత్రం అందజేసిన SFI జిల్లా కార్యదర్శి కేలోతు సాయి కుమార్, డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్, జిల్లా నాయకులు సింహాద్రి, పట్టణ నాయకులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *