మేనేని రోహిత్ రావు ఆత్మీయ ఇఫ్తార్ విందు

మేనేని రోహిత్ రావు
ఆత్మీయ ఇఫ్తార్ విందు

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : రంజాన్ పవిత్ర మాసం సందర్బంగా ముస్లిం సోదరులకు దివంగత నేత ఎమ్మెస్సార్ మనువడు కరీంనగర్ నియోజకవర్గ నాయకులు మేనేని రోహిత్ రావు ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక ముస్లిం షాదిఖానా ఫంక్షన్ హల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలు మధ్య ఆత్మీయంగా ఇఫ్తార్ విందు కొనసాగింది. ముందుగా మహమ్మద్ ప్రవక్త యొక్క ప్రవచనాలను బోధించి దివ్య ఖురాన్ భూమి పై వచ్చిన మాసంగా ఇది పవిత్ర మాసంగా గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్బంగా మేనేని రోహిత్ రావు మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, గంగా జమున తెహజీబ్ కు ప్రతిరూపంగా మారుతాయని ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉన్న ప్రతి ముస్లిం సోదరునికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకాగా నిలిచిందని, ఉపవాస దీక్షలు పాటించే ముస్లిం సోదరులకు ఖర్జుర పండ్లు, డ్రైఫ్రూట్స్ తినిపించి రోజాను విరమింపజేశారు. ఇఫ్తార్ విందులు స్నేహబంధాన్ని పెంపొందిస్తాయని, హిందూ ముస్లిం ఐక్యతకు మారుపేరుగా నిలుస్తాయన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అల్లాహ్ మెప్పు కోసం నెల రోజుల పాటు కఠోర మైన ఉపవాస దీక్షలు పాటించి, నెల రోజులు ఖురాన్ పారాయణం, తరవీహ్ నమాజ్ క్రమం తప్పకుండా ఆచరించి పుణ్య ఫలాలు పొందడం గొప్ప ధార్మిక సంకల్పమని కొనియాడారు. మనిషి జీవితంలో సంపాదన, డబ్బు కంటే ఆధ్యాత్మిక చింతనే ముఖ్యమన్నారు.

ఏడాదిలో 11 నెలలు తమ కోసం, ఒక నెల రమాజన్ మాసం మొత్తం అల్లాహ్ కోసం కేటాయించి, చిన్న తప్పు చేయకుండా, చెడుకు దూరంగా ఉండి పవిత్రమైన ఉపవాస దీక్షలు పాటించడం అంటే ఏకేశ్వరుడైన అల్లాహ్ కరుణా కటాక్షములు పొందడమేనన్నారు. కాంగ్రెస్ హయాంలో సర్వ మతాలకు అన్ని విధాల ప్రాధాన్యం ఉండేదని నేడు అది కనిపించడం లేదన్నారు. అనంతరం ఇఫ్తార్ విందుకు హాజరైన యువనేత రోహిత్ రావుకు పూలమాలలు, శాలువాతో ఇస్లామీయ సంప్రదాయ బద్దంగా ముస్లిం సోదరులు ఆత్మీయ సన్మానం చేశారు. దావాతే ఇఫ్తార్ అనంతరం 1000 మందికి రుచికరమైన బోజనాలను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, టి పి సి సి కార్యదర్శి రహమత్ హుస్సేన్, వైద్యుల అంజన్ కుమార్, సమద్ నవాబ్, మైనర్ విశాల్ జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, కలీం, మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు అఖిల్, మోసిన్, ఇర్ఫాన్, ఇమ్రాన్, సామాజిక కార్యకర్త మొహమ్మద్ అమీర్, అజీజ్ హుస్సేన్, సాదిక్, వాజిద్, సయ్యద్ సమీర్, అష్రాఫ్, హైమద్, అక్బర్, లైక్, నేహాల్, కమురుద్దీన్, కిసాన్ సెల్ కొత్తపల్లి మండల అధ్యక్షులు సిరిపురం నాగప్రసాద్, దుర్షెడ్ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర హరీష్ గౌడ్, బొమ్మకల్ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆరెపల్లి శ్రీకాంత్, పిట్టల సాయి,శివ ప్రసాద్,మాట్ల వంశీ,తాడూరి అజయ్, కొత్తకొండ సాయి గణేష్, రాజ్ కోటి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *