సావిత్రి భాయి పూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి

సావిత్రిబాయి స్ఫూర్తితో మహిళా సాధికారతను సాధిద్దాం
డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్
హైదరాబాద్, జనవరి 3 (విశ్వం న్యూస్) : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి పూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని బత్తిని కీర్తిలత గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చదువుల తల్లి సావిత్రిభాయి 192 వ జయంతిని పురస్కరించుకుని మణికొండ లోని ప్రభుత్వ పాఠశాలలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు,మాంగల్యం ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ బత్తిని కీర్తి లతా గౌడ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరం మహిళలకు ఆదర్శనీయం అని అతి చిన్న వయసులోనే నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా, బాలిక విద్య కోసం పాటుపడిన మహనీయురాలు అని కొనియాడారు. స్త్రీలకు విద్య అవసరం అని గుర్తించి భర్త జ్యోతిబాపూలే ద్వారా విద్యను అభ్యసించి, అనేక మంది ఆడపిల్లలకు చదువు నేర్పించి దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు గావించిందన్నారు.
ఉపాధ్యాయురాలు గానే కాకుండా ఆనాటి పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమంలో భర్తతో పాటు పోరాటం చేసిందని,ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటితరం యువత సమాజంలో జరుగుతున్న అసమానతలకు, రుగ్మతలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సావిత్రిబాయి పూలేను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయాల కోసం పని చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమం మణికొండ, పుప్పాలగూడ, నెక్నంపూర్, వీకర్ సెక్షన్ ప్రధానోపాధ్యాయులు నిరంజన్, మాంగ్య నాయక్, నిర్మల సహకారంతో మహిళ ఉపాధ్యాయినిలకు సన్మాన కార్యక్రమం మంగళవారం 2023 జనవరి 03 రోజున మణికొండ జడ్ పీ హెచ్ ఎస్ స్కూల్, పుప్పాలగూడ నిక్నంపూర్ వీకర్ సెక్షన్ ఆవరణలో జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో అతిథులుగా హాజరైన నటుడు సింగర్ అండ్ రైటర్ మానుకోట ప్రసాద్ మరియు లావణ్యలు సావిత్రిబాయి పూలే త్యాగాలను అలనాటి పరిస్థితులను తమ పాటల ద్వారా విచ్చేసిన అతిథులకు, ఉపద్యాయ ఉపద్యానీలకు, పిల్లలకు శ్రవనానందం గావించినారు, తదుపరి ప్రదనోపాద్యులిద్దరు, ముఖ్య అతిథిలు బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, బీ ఆర్ ఎస్ నాయకుడు ఏర్పుల కుమార్, ఉపాధ్యాయురాలు సరిత, సావిత్రిబాయి పూలే అనుభవాలను, అనుభవించిన కష్టాలను, త్యాగాలను కళ్ళకు కట్టినట్లు వివరించి విద్యార్థినీ విద్యార్థులు ఆమే యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించిన్నారు, ఇట్టి శుభ కార్యక్రమంలో మనికొండ మునిసిపల్ కౌన్సిలర్లు చవాన్ వసంత్ రావు, ఆలస్యం నవీన్ కుమార్, బుద్దొల్ కావ్య శ్రీరాములు, మీనా ముత్యాలు, వందనా, శ్వేత, కో ఆప్షన్ మెంబర్ లక్ష్మి ,బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, సీతారామదాసు, బషీర్, అందె లక్ష్మణ్ రావు, జయరాజ్, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మణ్ గంగాధర్ శాస్త్రీ, సందీప్ ,దిలీప్, శ్రావణ్, యలాల కిరణ్, శ్రీకాంత్, మహిళా నాయకురాల్లు శివ గంగా, విజయ లక్ష్మీ, డాక్టర్ ప్రభావతి, వందన మరియు విద్యార్థి విద్యార్థినీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

