సర్పంచ్ నీల కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

సర్పంచ్ నీల కుమార్ స్వామి
ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

వీణవంక, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్) : వీణవంక మండల కేంద్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు సర్పంచ్ నీల కుమారస్వామి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ నీల కుమారస్వామి, ఎస్సై శేఖర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలని సూచించారు. రంజాన్ పండగ మానవులకి మంచి హితబోధ చేస్తుందని ప్రతి మానవుడు క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలిగి ఉండాలని సందేశం ఇస్తుందని అన్నారు.

రంజాన్ మాసం సందర్భంగా హిందూ ముస్లిం సోదరులు సమైక్యంగా పాల్గొనే ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలుస్తున్నాయని అన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఉప సర్పంచ్ భానుచందర్, ముస్లిం మత పెద్దలు, అమీనుద్దీన్, మజార్, నషీర్, యాసీన్, నవాజుద్దీన్, గౌస్, సాయిబు హుస్సేన్, ఎండి కలిముద్దీన్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *