కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేద్దాము

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేద్దాము

హైదరాబాద్‌, జనవరి 4 (విశ్వం న్యూస్) : బుధవారం హైదరాబాద్‌ నగరంలోని బోయినిపల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో శిక్షణా కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మీడియా మొత్తం సపోర్ట్ చేసినా.. వైఎస్సార్‌ను ఏమీ చేయలేకపోయారని అన్నారు. ఏ మీడియా కూడా ప్రభుత్వాలను శాసించలేదన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామన్నారు.
‘ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ జోడో యాత్ర చేస్తున్నారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి యాత్ర చేస్తున్నారు. జనవరి 26న జెండా ఎగరేయడంతో బాధ్యత తీరలేదు. అందుకే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపట్టాలని సూచించింది. ప్రతీ గడపకు తట్టి రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి. పార్టీ ప్రతిష్టను పెంచేలా సందేశాన్ని తీసుకెళ్లాన బాధ్యత నాయకులపై ఉంది. ధరణితో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓటరు లిస్టులో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తే వాటిని తిరిగి చేర్పించాల్సిన అవసరం ఉంది..’ అని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై , కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేద్దామని ఆయన చెప్పారు. నిపుణులు అందరి సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిద్దామన్నారు. మనందరం కష్టపడితే కేసీఆర్ ఒక లెక్క కాదని.. బండ్లతోని, గుండ్లతోని అయ్యేది ఏం లేదంటూ బండి సంజయ్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *