విద్యా, ఉపాధికై విద్యార్థి యువకులు ఉద్యమించాలి

విద్యా, ఉపాధికై విద్యార్థి
యువకులు ఉద్యమించాలి

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్
రాష్ట్ర గర్ల్స్ సహయ కార్యదర్శి ఎండి మిశ్రిన్

గోవిందరావుపేట, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : విద్యార్థి యువజనలు తమ హక్కుల కోసం నిరంతర పోరాటం కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎండి మిశ్రిన్ పిలుపునిచ్చారు . శనివారం గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో రెండవ రోజు విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు కొనసాగాయి. ఈ తరగతి లకు ముఖ్య అతిథులుగా కిరణ్ మిశ్రీన్ హాజరై మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించక పెడదో పట్టిస్తున్నాయని మండిపడ్డారు. యువత ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలకు బారంగా మారారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు కొత్త పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులు నిరుద్యోగ యువకులను చైతన్యవంతం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బి సంజీవ మండల నాయకులు సిరిపల్లి జీవన్ మాదాసి శ్రావణ్ వినోద్ కణాల సందీప్ అరవింద్ మణికంఠ ఎస్ఎఫ్ఐ నాయకులు సిద్దు బాలు శివ కేశవ స్వామి రాకేష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కిరణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *