కొత్త సచివాలయాన్ని
ప్రారంభించిన కేసీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విశ్వం న్యూస్) : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి చేరుకున్నారు. మేయిన్ గేట్ వద్ద సీఎం కేసీఆర్కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అక్కడినుంచి నడుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి యాగశాలను సందర్శించారు. యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్ కు ఎలక్ట్రిక్ వెహికిల్ లో చేరుకుని పలు ఫైల్ పై సంతకాలు చేసి పరిపాలను ప్రారంభించారు. తొలి సంతకాన్ని ఆరు ఫైళ్ల పై చేశారు కేసీఆర్.