కరీంనగర్:మారం జగదీశ్వర్ కు
ఆత్మీయ ఘన సన్మానం
కరీంనగర్ బ్యూరో, మే 2 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ లో సోమవారం రోజు జరిగిన టీఎన్జీవోల కేంద్ర సంఘం ఎన్నికలలో కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్ అశీసులతో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయి బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా కరీంనగర్ కు విచ్చేసిన మారం జగదీశ్వర్ జిల్లా అధ్యక్షుల కి ఆత్మీయ ఘానా సన్మాన కార్యక్రమం టీఎన్జీవోల సంఘ భవనంలో జెఏసి కరీంనగర్ జిల్లా ఉద్యోగులందరు డిపార్ట్మెంట్ అధ్యక్ష కార్యదర్శులు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, తాలూకా అధ్యక్ష కార్యదర్శులు, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు కార్యదర్శులు, టీచర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, వారి మొత్తం కార్యవర్గంతో అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఉద్యోగులందరు అధిక సంఖ్యలో హాజరై ఆత్మీయ ఘానా సన్మానం చేసినారు.
సన్నాయి, బ్యాండు చుప్పుడులతో పురోహితుల ఆశీర్వాదములు అందించారు. ఫలు సంఘాలు ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. దీనికి టిఎన్జిఓ జిల్లా కార్యదర్శి దారం శ్రీనివాస్ రెడ్డి అద్యక్షతన ఈ సన్మాన కార్యక్రమము జరిగింది. అదేవిదంగా కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నాగుల నర్సింహా స్వామి, హరికృష్ణ కు అవకాశం దక్కింది వారిని కూడా సన్మానించు కోవడం జరిగింది.
ఈ కార్యక్రమములో సంఘం లక్ష్మన్ రావు జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, పెద్దపెల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొంక్కూరి శంకర్, నరేందర్ గౌడ్, శేషిదర్, నాగేందర్ రెడ్డి, శ్రీకాంత్, ఉపాధ్యాయుల శెంద్ర శేఖర్, కిరణ్ కుమార్, రాగి శ్రీను రవీందర్ రెడ్డి, గంగారపు రమేష్, ప్రసాద్ రెడ్డి శంకర్, అనిల్, రాజ్ మనోహర్, మనమిత్, అక్బర్, సివియ రాజేశ్వర్ రావు, శారదా, సునీత, విజయ, సరితా, రాజేష్ భరద్వాజ్, కిషన్,అబ్జల్, రామస్వామి, నర్సింహా రెడ్డి, పోలు కిషన్, కామ సతీష్ లవకుమార్, ప్రభాకర్ రెడ్డి, రాజమల్లయ్య్య, బిక్షపతి, బల్ బీర్ సింగ్ క్, కేశవా రెడ్డి, లింగయ్య, మోసం అంజన్నన, మహేందర్ రెడ్డిడి, రాజిరెడ్డి, జీవన్ రెడ్డి, రాఘవ రెడ్డి, వివిధ డిపార్ట్మెంట్ అధ్యక్ష కార్యదర్శులు, ఉమ్మడి జిల్లా ఉద్యోగులు దాదాపు 1000 మంది ఉద్యోగులు పాల్గొన్నారని కరీంనగర్ జిల్లా టిఎన్జిఓల సంఘం కార్యదర్శి దారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.