కరీంనగర్:మంత్రి గంగులను
నిలదీసిన కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్ బ్యూరో, మే 2 (విశ్వం న్యూస్) : వడగళ్ళ వానతో నష్టపోయిన రైతులను ఆదుకొవాలనే నినాదం తో గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావు ఉద్యమిస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో మంగవారం రోజు స్థానిక మంత్రి గంగుల కమలాకర్ దుర్షెడ్ , గోపాల్ పూర్ ఐకేపి సెంటర్లను సందర్శన కార్యక్రమం సందర్బంగా కరీంనగర్ నియోజకవర్గ నాయకులు మేనేని రోహిత్ రావు , జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ని అడ్డుకోవడం జరిగింది.
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఐకెపి సెంటర్లలో రైతులకు అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 2023 ఏప్రిల్ 21 రోజున విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు పరదలు అందించడం జరిగిందని తెలియజేసిన విషయాన్నీ మంత్రి కి గుర్తు చేస్తూ ఆ సంబంధిత న్యూస్ పేపర్ లను చూపించడం జరిగింది. ఇంతవరకు కరీంనగర్ నియోజకవర్గంలో ఏ ఐకేపి సెంటర్లలలో ఒక్క పరదా కూడా అందజేయలేదని నిలదీశారు. మరి ఈ విషయం లో ఏదైనా కుంభకోణం జరిగిందా అని ప్రశ్నింస్తుండగా అక్కడ ఉన్న బి ఆర్ ఎస్ కార్యకర్తలు వాగ్వదానికి దిగడంతో బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులట జరిగింది. ధీంతో కాంగ్రెస్ నాయకులు జై కాంగ్రెస్ జై రోహిత్ అన్న నినాదాలతో మంత్రి కాన్వాయి కి అడ్డుగా వెళ్లడం జరిగింది.
ఈ సందర్బంగా మేనేని రోహిత్ రావు మాట్లాడుతూ సమరస్యంగా మంత్రి కి రైతుల సమస్యలను వివరించడానికి వస్తే బిఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టి యుద్ధ వాతావరణానికి కారణమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పరదలు అందించామని గొప్పలు చెప్పుకున్న మంత్రి గంగుల కమలాకర్ ఏ ఒక్క రైతుకు పరదలు అందజేయని పక్షంలో అడిగిన ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా విషయాన్ని పక్కదారి పట్టిస్తూ అక్కడి నుండి వెనుతిరిగి పోయారని ఎద్దేవా చేశారు.అదేవిధంగా రైతుల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కామిరెడ్డి రామిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కొత్తపెల్లి మండల్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సిరిపురం నాగప్రసాద్, సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోసిన్, బుర్ర హరీష్ గౌడ్, కాశిపాక రాకేష్, రాజి రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వీరేశం, పడాల శ్రీనివాస్, చర్ల పవన్, నరేష్, అజయ్, గణేష్, నర్సయ్య, కోటి తదితరులు పాల్గొన్నారు.