నిరుద్యోగ భృతి ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం

నిరుద్యోగ భృతి ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం

బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దురిశెట్టి సంపత్
తిమ్మాపూర్, జనవరి 5, (విశ్వం న్యూస్) : నిరుద్యోగ భృతి ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉందని బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్య క్షులు దురుశెట్టి సంపత్ ఆరోపించారు. గురువారం బిజెవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ… నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి దేశంలోని యువతి యువకులకు ఉపాధి అవకాశాలను మెరు గు పరచడానికి పటిష్ట చర్యలు చేపట్టిందని అన్నారు. దేశంలో యువశక్తి ప్రాధాన్యతను మోడీ ప్రభుత్వం గుర్తించిందని, ఆ దిశలోనే యువతి యువకుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి అనేక కార్యక్ర మాలను చేపడుతుందని తెలిపారు. ముఖ్యంగా అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తుందని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రా మింగ్ తో నిరుద్యోగులందర్నీ ఆదుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభు త్వం 9 ఏళ్ల కాలంలో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుందని ఆరోపించారు. నోటిఫికేషన్ల కోసం యువతీ, యువకులు ఏళ్లకాలంగా నిరీక్షించా రని, అరకొర నోటిఫికేషన్లతో కాలయాపన చేస్తూ నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఉద్యోగాలు ఇచ్చుడేమోగాని ఉన్న ఉద్యోగాలను కూడా తొలగించే ప్రయత్నంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు.నిరుద్యోగులను ఆదుకోవ డానికి కెసిఆర్ ప్రభుత్వానికి పాలసీ లేకుండా పోయిం దని విమర్శించారు.కెసిఆర్ సర్కార్ కు రాబోయే ఎన్నికల్లో బుద్దిచెప్పెందుకు యువత సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాట బాటపట్టాలని, స్థానిక సమస్యలపై కూడా ఉద్యమిం చాలని, నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా కార్యక్ర మాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఈ సంద ర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపా ధ్యక్షులు ఈసరి జశ్వంత్, జిల్లా కార్యదర్శి తిప్పర్తి నికేశ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి రేగుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దోనపాటి ప్రదీప్, ఆవుల వేణు యాదవ్, కార్యదర్శులు అన్నాడి రమణారెడ్డి, అల్లెపు మహేష్, దుర్సెటి అజయ్, గుండోజు అరవింద్, బూడిద అక్షయ్, రేగుల శ్రీనివాస్ పుట్ట ఓంకార్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *