యువ సంఘర్షణ సభ
పోస్టర్ ఆవిష్కరణ

పోస్టర్ ఆవిష్కరణ చేసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగూరి సదయ్య
జమ్మికుంట, మే 8 (విశ్వం న్యూస్) : నిరుధ్యోగులకు బాసటగా నిర్వహించే యువ సంఘర్షణ సభ పోస్టర్ ను జమ్మికుంట గాంధీ చౌరస్తాలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగూరి సదయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొలుగూరి సదయ్య మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు నీళ్ళు, నిధులు, నియామకాల కోసం అలాంటిది అధికారంలోకి వచ్చిన బి.అర్.ఎస్ ప్రభుత్వం 9 సంత్సరాలుగా 90 వేల ప్రభుత్వ నియమాకాలు కూడా జరుపలేదు, ఎలక్షన్ టైమ్ లో ప్రకటించిన 81 వేల ఉద్యోగాలు అప్లై చేసిన, ఎగ్జామ్స్ రాసిన నిరుద్యోగుల జీవితాలను లీకేజి పేరిట కాలయాపనతో 32 లక్షల నిరుద్యోగులను వారి కుటుంబాలను ఆక్రందనకు గురిచేసిన కే.సి.అర్ ప్రభుత్వాన్ని గద్దేదించే నిరుద్యోగ-యువత డిక్లరేషన్ ప్రకటించడానికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వస్తున్నారని అందుకు హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగే యువ సంఘర్షణ సభ కోసం పార్టీలకు అతీతంగా యువతీ యువకులు, నిరుద్యోగులు స్వచ్చందంగా కదిలి రావాలని సదయ్య పిలుపు నిచ్చారు.
యూత్ గర్జన పోగ్రామ్ లో ప్రియాంక గాంధీ పాల్గొనే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బల్మూరి వెంకట్ ఆదేశాల మేరకు పోస్టర్ ఆవిష్కరణ గురించి నూతనంగా ఎన్నికైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగూరి సదయ్య మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు యువతకు ఉపాధి హామీ కల్పించడం విఫలం జరిగింది దానికి నిరసనగా రేపు హైదరాబాదులో సరూర్ నగర్ లో జరిగే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ యువజన డిక్లరేషన్ చేయబడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరుద్యోగులు యువత పాల్గొని విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు పుధరి రేణుక, మాజీ మార్కెట్ డైరెక్టర్ సలీం, సీనియర్ నాయకులు ఎగ్గని శ్రీనివాస్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ నాయకులు పొనగంటి రవీందర్, రాచపల్లి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ పరిధిలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.